వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Virgin Galactic: నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమో నౌక...

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న 'వర్జిన్ గెలాక్టిక్' మానవ సహిత అంతరిక్ష రోదసియానం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఐదుగురు వ్యోమగాములతో కూడిన వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమోనౌకను కాసేపటి క్రితమే వీఎంఎస్ ఈవ్ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి తీసుకెళ్లింది.

అంతకుముందు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రోదసి యాత్ర ప్రారంభం స్వల్ప వ్యవధికి వాయిదాపడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30గంటలకు(భారత కాలమానం) యాద్ర ప్రారంభం కావాల్సి ఉంది. మారిన షెడ్యూల్‌తో 90 నిమిషాలకు యాత్ర వాయిదాపడింది.

Virgin Galactics space flight taken off after slight delay

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష పరిశోధన సంస్థ నేత్రుత్వంలో 'వీఎస్‌ఎస్ యూనిటీ-22' అనే వ్యోమో నౌక ద్వారా ఈ రోదసియాత్ర జరగనుంది. అంతరిక్ష పర్యా‌ట‌కానికి బాటలు వేయాలన్న లక్ష్యం దిశగా ఇది తొలి అడుగుకానుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాస్‌నన్‌‌తో పాటు మరో నలుగురు ఈ వ్యోమో నౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు. ఇందులో భారత సంతతి మహిళ శిరీష బండ్ల ఉండటం విశేషం. తెలుగు మూలాలు ఉన్న ఓ మహిళ రోదసిలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి.గతంలో భారత సంతతి మహిళలు కల్పనా చావ్లా,సునీతా విలియమ్స్ కూడా రోదసీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ని భూమి నుంచి 15వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెడుతుంది.ఈ వ్యోమోనౌక భూమి నుంచి గరిష్ఠంగా 90కి.మీ ఎత్తుకు వెళ్తుంది.ఆ స్థితిలో రిచర్డ్ బ్రాన్సర్ వ్యోమో నౌక క్యాబిన్‌లోని కిటికీ నుంచి కిందకు చూస్తారు. తిరిగి తన సీటులోకి వెళ్తారు. ఆ తర్వాత న్యూ మెక్సికోలోని స్పేస్ పోర్టుకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

భవిష్యత్తులో సామాన్య ప్రజలు సైతం అంతరిక్షంలోకి ప్రయాణించేలా... వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని రిచర్డ్ బ్రాస్‌నన్ భావిస్తున్నారు. ఆ లక్ష్యంతోనే తన సంస్థ 'వర్జిన్ గెలాక్టిక్' నేత్రుత్వంలో మానవ సహిత అంతరిక్ష రోదసియానానికి శ్రీకారం చుట్టారు.

Recommended Video

China Mars Mission : అంగారకుడిపై రోవర్ Historic Landing | Zhurong ఏం చేస్తుంది ? | Oneindia Telugu

English summary
British billionaire Richard Branson took off for space on VSS Unity 22 from Spaceport America in New Mexico on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X