వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడ కట్టి తీరుతాం: అనుమానాలపై డొనాల్డ్ ట్రంప్

అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరతామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని వార్తలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరతామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. దీంతో ట్రంప్ స్పందించారు.

ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోడ కట్టి తీరతామన్నారు. దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చన్నారు.

వాస్తవానికి ఇవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలన్నారు. కానీ వీటిపై ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3,100 కి.మీ,. గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్లు వెల్లడించారు.

Wall ‘Will Get Built,’ Trump Insists, as He Drops Funding Demand

గోడ కట్టేందుకు అనేక ప్రాంతాల్లో సాధ్యం కాకపోవడంతో 1600 కి.మీ. మేర నిర్మించనున్నట్టు ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇటీవల తనని కలిసిన రక్షణ కార్యదర్శి జాన్‌ కెల్లీ సైతం కచ్చితంగా ఓ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారని ట్రంప్‌ వెల్లడించారు.

అయితే కొందరు దీనికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని, వందశాతం గోడ కట్టితీరతామని ట్రంప్ అన్నారు. ఇందుకోసం ఫండింగ్ డిమాండును ట్రంప్ పక్కన పెట్టారు.

English summary
President Trump insisted on Tuesday that he remained committed to his hotly disputed plan to build a wall along the Mexican border, despite backing off a demand that the project be funded in a short-term spending measure that must be passed by Friday to avoid a government shutdown
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X