భారత్ కు యుద్ధనౌక తయారు చేసి ఇచ్చిన బద్ధశత్రువులు రష్యా-ఉక్రెయిన్..!
అంతర్జాతీయంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు నెరుపుతున్న భారత్ కు మరో గుడ్ న్యూస్. ప్రాంతీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, యుద్ధాలు చేసుకుంటున్నా పలు దేశాలు భారత్ తో మాత్రం సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా భారత్ పై వారికి ఉన్న అచంచల విశ్వాసమే ఇందుకు నిదర్శనం. దీన్ని మరోసారి నిరూపిస్తూ ప్రస్తుతం యుద్ధంలో ఉన్న రష్యా-ఉక్రెయిన్ భారత్ కు ఓ యుద్ధ నౌక తయారు చేసి ఇచ్చాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఈ యుద్దం కారణంగా ఇరుదేశాలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. అయినా యుద్దం నుంచి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాటో కూటమిలో ఉక్రెయిన్ కు చోటు కల్పించేందుకు పాశ్చాత్య దేశాలు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ గా రష్యా ప్రారంభించిన యుద్దం ఇంకా కొనసాగుతోంది. దీంతో ఉక్రెయిన్ కు అవే నాటో దేశాలు యుద్ధంలో అన్ని విధాలుగా సాయం చేస్తున్నాయి. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణుదాడి సన్నద్ధతకు అవసరమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు.

ఇలాంటి పరిస్ధితుల్లో బద్ధ శత్రువులైన రష్యా, ఉక్రెయిన్ ఉమ్మడిగా ఓ కార్యక్రమం చేపట్టాయి. భారత్ కోసం ఇరుదేశాలూ కలిసి ఓ నేవీ యుద్ధ నౌకను తయారు చేసి ఇచ్చాయి. రష్యాలో తయారైన ఈ నౌకకు ఉక్రెయిన్ ఇంజన్ బిగించి ఇచ్చింది. ఈ నౌక పేరు ద ఫ్రిగేట్-ఐఎన్ఎస్ తుషీల్. 2016లో భారత్ ఇలాంటి రెండు నౌకల తయారీకి రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. రష్యాకు చెందిన క్రివాక్-3 శ్రేణి యుద్ధ నౌక ఇది. అత్యాధునిక స్టెల్త్ క్షిపణి వాహక నౌక ఇది. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆరు యుద్ధ నౌకలూ రష్యా తయారు చేసి ఇచ్చినవే.
#WATCH | Russia: The INS Tushil was commissioned today in Russia in the presence of Defence Minister Rajnath Singh.
— ANI (@ANI) December 9, 2024
(Source: Indian Navy) pic.twitter.com/mAVAWC2WTn
రష్యాలో తయారవుతున్న ఇలాంటి రెండు యుద్ధ నౌకలతో పాటు, ఇలాంటి మరో రెండు నౌకలను భారతదేశంలో తయారు చేసేందుకు వీలుగా ఇరుదేశాలూ గతంలో ఒప్పందం చేసుకున్నాయి. గోవా షిప్‌యార్డ్‌లో వీటిని తయారు చేయనున్నారు.
ఈ యుద్ధనౌకల యొక్క ప్రాథమిక ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు ఉక్రెయిన్‌లో తయారు చేశారు. ఉక్రేనియన్ ఇంజిన్‌తో కూడిన రష్యన్ యుద్ధనౌక భారత్ కోసం తయారు చేసినట్లయింది. ఇరుదేశాల మధ్య భారత్ కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఈ నౌకను రష్యా అందజేసింది.












Click it and Unblock the Notifications