వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవిందా.. గోవింద!: మీ పాస్ వర్డ్ ఇదే అయితే.. అర్జెంటుగా మార్చేయండి

2016లో నిర్వహించిన ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. అత్యధికులు '123456' అంకెల వరుసను పాస్ వర్డ్ గా పెట్టుకుని, హ్యాకర్ల చేతికి చిక్కి నష్టపోయారని.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చికాగో: సాధారణంగా ఇంట్లో పుట్టిన పాపకు లేదా బాబుకు పేరు పెట్టేందుకు మనం కొన్ని వందల పేర్లను పరిశీలిస్తాం. ఆనక వాటన్నిటిలో విభిన్నమైన పేరును ఎంచుకునేందుకు ప్రయత్నిస్తాం.

అలాంటిది మన కష్టార్జితాన్ని దాచుకునే బ్యాంక్ ఖాతాల పాస్ వర్డ్ లు, అలాగే సోషల్ మీడియా వెబ్ సైట్ల పాస్ వర్డ్ లు, ఈ-మెయిల్ పాస్ వర్డ్ లు, పనిచేస్తున్న సంస్థల్లో ఉపయోగించే పాస్ వర్డ్ లను ఇంకెంత జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

2016లో దాదాపు కోటి మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అత్యధికులు '123456' అంకెల వరుసను పాస్ వర్డ్ గా పెట్టుకున్నారని, వీరిలో ఎక్కువమంది హ్యాకర్ల చేతికి చిక్కి నష్టపోయారని.

What the Most Common Passwords of 2016 List Reveals

ఈ అంకెల వరుస వరల్డ్ మోస్ట్ పాపులర్ పాస్ వర్డ్ గా ఉన్నట్లు ఈ సర్వేను నిర్వహించిన భద్రతా సంస్థ 'కీపర్ సెక్యూరిటీ' పేర్కొంది. గతేడాది 10 మిలియన్ల ఖాతాలను హ్యాక్ చేసి ఇంటర్నెట్ లో బహిర్గతం చేసిన విషయం విదితమే.

చాలామంది ఆన్ లైన్ వినియోగదారులు బహుళ ఖాతాలకు కూడా ఒకే పాస్ వర్డ్ పెట్టుకోవడమనేది ఆశ్చర్యమే కాదు, ఆందోళన కలిగించే విషయం. ఇంకా పాస్ వర్డ్ గా '123456789'సంఖ్యను ఎంపిక చేసుకున్న వారు రెండో స్థానంలో ఉండగా, కీబోర్డులోని ఆంగ్ల అక్షరాల వరుస 'qwerty'పాపులర్ పాస్ వర్డ్ ల వరుసలో మూడో స్థానంలో నిలిచినట్లు కీపర్ సెక్యూరిటీ సంస్థ తన సర్వే నివేదికలో వెల్లడించింది.

English summary
Looking at the list of 2016’s most common passwords, we couldn’t stop shaking our heads. Nearly 17 percent of users are safeguarding their accounts with “123456.” What really perplexed us is that so many website operators are not enforcing password security best practices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X