US Poll Results: భారత్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తెలిసేది అప్పుడే..!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అది ప్రపంచానికే ఎన్నికలన్నమాట. అమెరికాతో పాటు అన్ని దేశాల్లోనూ వీటిపై ప్రతిసారి ఆసక్తి నెలకొంటుంది. దీనికి కారణం ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న అమెరికాకు అధ్యక్షులయ్యే వారు ఆ దేశానికి మాత్రమే కాదు ప్రపంచాన్నే శాసించే వ్యక్తిలా ఉంటారు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అందరికీ ఇంత ఆసక్తి. ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్దమైంది. రేపు జరిగే ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుంది.
అయితే భారత్ లో ఉండే వారికి ఈ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయన్న ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత కాలమానం ప్రకారం నవంబర్ 5 మంగళవారం రాత్రి జరగబోతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్‌లో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు అమెరికన్లు తమ ఓటు వేస్తారు. సాధారణంగా అమెరికా మీడియా సంస్థలు ఎన్నికల రాత్రే అధ్యక్ష ఎన్నికల విజేతను ప్రకటిస్తాయి.

అంటే అమెరికాలో మంగళవారం రాత్రికే ఫలితాలు తెలుస్తాయి. భారత కాలమానం ప్రకారం చూస్తే బుధవారం ఉదయం మనకు ఈ ఫలితాలు తెలుస్తాయి. అధికారిక ఫలితాలు మాత్రం బుధవారం రాత్రి నుంచి వెలువడతాయి. వాస్తవానికి అమెరికాలో ఎన్నికలు భారత్ లో లా దశల వారీ ఉండవు. ఒకేసారి జరుగుతాయి. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 16 టైమ్ జోన్స్ ఉంటాయి. కాబట్టి వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తవ్వాలంటే నవంబర్ 6న కూడా పోలింగ్ కేంద్రాలు తెరిచే ఉంటాయి. అలాగే ఓటరు నాడిని అంచనా వేయడానికి ఉద్దేశించిన ఎగ్జిట్ పోలింగ్ నవంబర్ 6 ఉదయం రెండున్నరకు ప్రారంభమవుతుంది.
ఈసారి అమెరికా అధ్యక్షులు కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించినట్లయితే విజయం సాధించినట్లే. అధికారిక ఫలితం వెలువడకముందే ఈ మార్జిన్ దాటిన వారిని ఈసారి ఎన్నికల్లో విజేతగా భావించవచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications