ముక్కులో దాన్ని చూసి డాక్టర్స్ షాక్: మంటగా ఉందని వెళ్తే.. ఇలా!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న ఆసుపత్రి ముఖం చూడనివారు చాలామందే ఉంటారు. ఏముందిలే అదే తగ్గిపోతుందని సర్ది చెప్పుకుంటుంటారు. కానీ తీరా పీకల మీదికొచ్చాక ఆసుపత్రికి పరిగెత్తితే.. అప్పటికి పరిస్థితి విషమించవచ్చు. అదృష్టం బాగుంటే బతికి బట్టకట్టనూ వచ్చు.

చైనాలోను ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ముక్కులో మంటతో బాధపడుతున్న ఓ మహిళ.. చాలాకాలంగా దాన్ని అశ్రద్ద చేస్తూ వచ్చింది. ఇటీవల మంట మరీ ఎక్కువవడంతో.. తప్పనిసరై ఆసుపత్రికి వెళ్లింది. దీంతో ఆమె నాసిక రంధ్రాలను పరిశీలించిన డాక్టర్లు అవాక్కయ్యారు.

Woman finds tooth growing inside her nose

ముక్కులో తెల్లగా గడ్డకట్టినట్టు ఉన్న పదార్థాన్ని చూసి ఏదైనా వస్తువేమోనని తొలుత భావించారు. కానీ అది పెరిగి వచ్చిన దంతం అని తెలిసి షాక్ తిన్నారు. సాధారణంగా ఉండే దంతాల కన్నా ఎక్కువ దంతాలు ఉండటం వల్ల సూపర్ న్యూమరరీ టీత్‌ అనే సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె కూడా ఇదే సమస్యతో బాధపడుతోందన్నారు.

సర్జరీ ద్వారా పన్నును తొలగించడంతో ఇప్పుడా మహిళ ఆరోగ్యం కుదుటపడింది. అంతకుముందు తరుచూ ముక్కు నుంచి రక్తం కారేదని, ఇప్పుడు అలాంటి సమస్యేమి లేదని చెప్పినట్టు సమాచారం. కాగా, సూపర్ న్యూమరరీ టీత్‌ అనేది ముఖంలోని ఏ భాగంలోనైనా పెరగవచ్చునని వైద్యులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Xia had been living with nose bleeding and pain for many decades. She thought it was severe rhinitis and continued to endure the ordeal,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి