డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన బీఆర్ఎస్ నేత మృతి (వీడియో)
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం సంబరాల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన బండారి నరేందర్‌ను అక్కడేవున్న కార్యకర్తలు సీపీఆర్ చేశారు. మంచి నీళ్లు తాగించి.. స్పృహలోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత వెంటనే వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. ఆస్పత్రిలో కోలుకుని తిరిగవస్తారని భావించిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఆయన మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

నరేందర్ గుండెపోటు కారణంగానే మరణించారని వైద్యులు తెలిపారు. కవిత ఆధ్వర్యంలో జగిత్యాలలో శనివారం రోడ్ షో, ఆ తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర మృతి చెందడంతో బీఆర్ఎస్ సమ్మేళనం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
#BRS leader Bandari Narendra died of heart attack while dancing in jagtial BRS spiritual meeting in Jagityal town. @BRSparty @Bjp4jagityal pic.twitter.com/QmGMnjOtjK
— R V K Rao_TNIE (@RVKRao2) April 1, 2023
నరేందర్ హఠాన్మరణంతో జగిత్యాలలో శనివారం కవిత తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేదిక వద్దే నరేంద్ర చిత్రపటానికి, ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళుర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్.












Click it and Unblock the Notifications