Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో

కడప: కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఉన్మాదిగా మారాడు. ఓ యువతిపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘాతుకానికి తెగబడ్డ యువకుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Recommended Video

    #crime కడప: ప్రేమ నిరాకరించిందని యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం

    నిందితుడి పేరు సునీల్. ప్రొద్దుటూరులోని వివేకానంద నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని అతను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కొద్ది రోజులుగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తుండేవాడు. ఇంట్లో వాళ్లకు తమ ప్రేమ వ్యవహారాన్ని చెబుతానంటూ బెదిరించేవాడు. తనను ప్రేమించకపోతే. చంపేస్తానంటూ హెచ్చరిస్తుండే వాడు. అతని బెదిరింపులను బాధిత యువతి పట్టించుకోలేదు.

    17-year- old Woman joined in hospital in Proddatur in Kadapa district

    దీనితో ఆగ్రహానికి గురైన సునీల్.. ఆ యువతిని హతమార్చాలని కుట్ర పన్నాడు. ఈ దారుణానికి దిగాడు. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటిపై దాడి చేశాడు. కత్తితో దాడి చేశాడు. ఇష్టానుసారంగా పొడిచాడు. దీనితో బాధితురాలి చేతులు, తలకు తీవ్రగాయాలయ్యాయి. కత్తితో దాడి చేస్తోన్న సమయంలో బాధితురాలు చేతులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె చేతి వేళ్లు తెగినట్లు చెబుతున్నారు. ఆమె కేకలతో విన్న స్థానికులు..ఇంటికి చేరుకునే సమయానికే సునీల్ తప్పించుకుని పారిపోయాడు.

    స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతికి సునీల్ పరిచయస్తుడేనని, ఇదివరకు వారిద్దరు ప్రేమించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం బాధితురాలి తెలియడంతో కొంతకాలంగా ఆమె సునీల్‌ను దూరం పెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా ఆమెపై కోపం పెంచుకున్న సునీల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆసుపత్రికి వెళ్లి.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సునీల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతని కోసం గాలిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+