Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిర్యాదుల ఎఫెక్ట్: కరీంనగర్ కలెక్టర్, పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా, కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు పడింది. కలెక్టర్ గోపీ, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కలెక్టర్, సీపీని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

EC Orders: karimnagar collector and police commissioner transfer.

తనిఖీల్లో భారీగా పట్టుబడిన బంగారం, నగదు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేస్తున్న సోదాల్లో భారీ స్థాయిలో బంగారం, నగదు పట్టుబడుతోంది. తాజాగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్​పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసు తనిఖీల్లో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది.

తెలంగాణ, కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపడుతుండగా.. స్కార్పియో వాహనంలో తరలిస్తున్న 7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.4.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌​కు బిస్కెట్లు సహా ఆభరణాల రూపంలో బంగారం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన పోలీసులు.. ఎన్నికల అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

మరోవైప, హైదరాబాద్‌ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఆసిఫ్ నగర్‌లోని గుడిమల్కాపూర్‌ రోడ్డులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఓ కారులో నగదు తరలిస్తున్నట్టు గుర్తించారు. కోటి 78 లక్షల 30 వేల రూపాయలు సీజ్‌ చేశారు. కారులో డబ్బులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు సౌదీలో ఉద్యోగం చేస్తున్న వారిగా గుర్తించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+