కనురెప్పే కాటేసింది.. కూతురిపై కన్న తండ్రి లైంగికదాడి, బడితపూజ చేసిన భార్య..
కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కాటేస్తున్నారు. అండగా ఉండాల్సిన తోడబుట్టువులు కామాంధుల్లా మారుతున్నారు. అత్యాచారాలకు తెగబడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారు. కూతురిపై కన్నతండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగింది.

కన్నతండ్రే..
కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్న తనంలో ఆ బాలిక నరకాన్ని చవిచూసింది. బాలిక ఇటీవల నీరసంగా ఉంటోంది. గమనించిన తల్లి నిలదీయడంతో కన్నతండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తనను లైంగికంగా ఏ విధంగా వేధిస్తున్నాడో వివరిస్తూ బోరున విలపించింది. విషయం తెలిసి ఆమె షాక్‌నకి గురైంది. తర్వాత కామాంధుడైన భర్తకు దేహశుద్ధి చేసింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

చెల్లెలిపై అన్న
ఇలాంటి దారుణం మరొకటి జరిగింది. చెల్లెలు వరుసయ్యే యువతితో అన్నయ్యలా నటిస్తూ వచ్చిన కామాంధుడు లైంగికంగా వేధించాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లి ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించింది. ఆగ్రహించిన తల్లి ఆ నీచుడిని నిలదీసింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.

తండ్రి, సోదరులు ఇలా
తండ్రి, సోదర సమానుల వరుసలు మరుస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అయిన వారు కావడం, ఏం చేస్తారోనన్న భయంతో అటు బయటపడలేక.. ఇటు నరకాన్ని భరించలేక కుమిలిపోతున్నారు. వేధింపులు తారాస్థాయికి చేరిన సందర్భాల్లో మాత్రమే జరిగిన ఘోరం బయటకు వస్తుంది.

సర్వే ఏం చెప్పిందంటే
మైనర్లపై అఘాయిత్యాలు జరిగిన ఉదంతాలను చూస్తే వారి కుటుంబ నేపథ్యం ప్రధాన కారణంగా నిలుస్తోంది. దుర్భర పేదరికంతోపాటు మద్యం వంటి వ్యసనాలకు గురవుతున్న వారే ఈడొచ్చిన బాలికలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. స్కూల్/ కాలేజీ నుంచి డ్రాపౌట్ అయి ఇళ్లకే పరిమితం అవుతున్న వారు, లేదా పేదరికంతో బడి గడప తొక్కని బాలికలే సహజంగా ఇంటా, బయటా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ సర్వే కూడా తేల్చింది.












Click it and Unblock the Notifications