డ్యూటీకి డుమ్మా కొట్టి సైరా చూసిన ఎస్పైలు.. జిల్లా ఎస్పీ సీరియస్
అక్టోబర్ 2న విడుదలైన సైరా సినిమా ఆరుగురు ఎస్సైలపై చర్యలకు కారణమైంది. విధుల్లో ఉంటూ సినిమా చూసేందుకు వెళ్లిన ఎస్సైలపై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. అనంతరం వారిపై చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా కోవేల కుంట్లకు చెందిన ఆరుగురు ఎస్సైలు నటుడు చిరంజీవితో పాటు తమ ప్రాంతానికి చెందిన నేపథ్యం ఉండడంతో సినిమా చూసేందుకు వెళ్లారు. ఉదయమే కదా రెండు గంటల్లో తిరిగి రావచ్చనే ఉద్దేశ్యంతో సినిమాకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్సైలు సమాచారం లేకుండా సినిమాకు వెళ్లిన అంశంపై జిల్లా ఎస్పీ వారిని మందలించినట్టు తెలుస్తోంది. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా కావడంతోపాటు చారిత్రక నేపథ్యం, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి స్టోరీ కావడతో, ఎస్సైలు సినిమాకు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సినిమాకు వెళ్లిన ఎస్సైల వివరాలు తెలియాల్సింది. సాధారణంగా సమాచారం లేకుండా తమ వ్యక్తిగత పనుల్లో పోలీసు అధికారులు మునిగిపోవడం సహజంగా జరుగుతోంది. అధికారుల సమాచారం, సమన్వయంతో చేయాల్సి ఉంటుంది.. కాని ఉన్నతాధికారులకు ఎలాంటీ సమాచారం లేకుండా వ్యక్తిగత పనుల్లో పాల్గోనడంతో ఆరుగురిపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications