తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చెన్నూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెన్నూరు ఒకటి. చెన్నూరు మంచిర్యాల జిల్లాలో ఉంది. జిల్లాల విభజనకు ముందు ఈ నియోజకవర్గం అదిలాబాద్ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొలిసారి చెన్నూరు విధానసభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నల్లాల ఓదేలు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నల్లాల ఓదేలుకు 64,867 ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు 38,703 ఓట్లు వచ్చాయి. 2009లోను ఇదే ఓదేలు, అదే కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ పైన గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాస్ రావు టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 2004 నుంచి వరుసగా టీఆర్ఎస్ గెలుస్తోంది. అంతకుముందు నాలుగుసార్లు టీడీపీ, అంతకంటే ముందు రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది.













Click it and Unblock the Notifications