నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా తూచ్.. అవీ ఫేక్, పోస్టర్లపై ఈటల రాజేందర్ గుస్సా..

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్, దుబ్బాక ప్రజల పేరుతో వెలసిన పోస్లర్లు కలకలం రేపాయిం. ఆ ప్రజలు మోసపోయారని అందులో ఉంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ స్పందించారు. అవీ తప్పు అని కామెంట్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.

తనను గెలిపించిన ప్రజలు బాధపడటం లేదని తెలిపారు. ఇదీ ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసింది మునుగోడు బిడ్డలే అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే భూస్వాములకు రైతుబంధు బంద్ చేస్తామని, కైలు రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారు.

 posters are manipulated: etela rajender

ఏకే 47 గన్‌ కంటే శక్తివంతమైనది ఓటు అని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. దాంతో ప్రజలు తమ నిర్ణయం తెలియజేస్తారని వివరించారు. కావాలనే పోస్టర్లు వేసి.. అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గోబెల్స్ ప్రచారాన్ని అంతా చూస్తున్నారని మండిపడ్డారు. నిజ నిజాలు త్వరలోనే తెలుస్తాయని గుర్తుచేశారు.

మునుగోడు బై పోల్ లో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడప్ చేసింది. టీఆర్ఎస్ జోరుగా క్యాంపెయిన్ చేస్తోంది. బీజేపీ కూడా అదేస్థాయిలో ముందుకు వెళుతుంది. అయితే బరిలో కూడా చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే వందకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరీ వారిలో ఎంతమంది విత్ డ్రా చేసుకుంటారో చూడాలీ. లేదంటే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక సమయంలో రైతులు బరిలో ఉన్నట్టు.. ఇక్కడ కూడా చాలా మంది బరిలో ఉంటారా అనే చర్చ జరుగుతుంది. అలా అయితే బ్యాలెట్ పేపర్ లో పోలింగ్ జరగాల్సి ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవారు పోటీకి దిగారు.

English summary
that posters are manipulated bjp mla etela rajender said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X