పోలా.. అదిరిపోలా.. కాంగ్రెస్ ప్లెక్సీలో టీఆర్ఎస్ నేత ఫోటో.. మరీ పార్టీ మార్పు ఖాయమేనా..?
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఏడాదిన్నర తర్వాతే.. కానీ నేతలు మాత్రం ఇప్పటినుంచే సీట్లను సర్దుబాటు చేసుకుంటారు. ఎక్కడి నుంచి ఏ పార్టీ ద్వారా పోటీలో ఉంటామో స్పష్టం చేస్తున్నారు. వారు అనుచరులతో చెప్పడమో.. బహిరంగ చర్యల ద్వారా తెలుస్తోంది. మరికొందరు సదరు పార్టీలో చేరకున్నా ప్లెక్సీలలో ఫోటో దర్శనం ఇస్తోంది. అలా నల్గొండ జిల్లాలో ప్లెక్సీలో నేత ఫోటో కనిపించింది. ఇంకేముంది అతను పార్టీ మారడం తథ్యం అని అర్థం అవుతుంది.

వేముల వీరేశం ఫోటో..
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో కనిపించింది. గత కొంతకాలంగా వీరేశం టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో వేముల వీరేశం ఫోటో ఉండటం కలకలం రేపుతోంది. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమేనని ఇండైరెక్టుగా సిగ్నల్ ఇచ్చారు.

రేవంత్, కోమటిరెడ్డి..
నార్కెట్ పల్లి మండలం అమ్మబోలులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో నకిరేకల్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోటో కనిపించింది. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ ఫోటోతో అదీ నిజం కానుంది. కానీ అధికారికంగా వీరేశం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అప్పటివరకు ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

డిష్యూం.. డిష్యూం...
నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మే డే సందర్భంగా జెండా ఎగురవేస్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులను ఎమ్మెల్యే లింగయ్య వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీతో సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే వేముల వర్గీయులు కార్యక్రమం ఎలా చేస్తారని లింగయ్య వర్గం నేతలు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. నేతలు బాహాబాహీకి దిగారు. అప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలో ఫోటో రావడంతో పార్టీ మారడం పక్కా అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్లాన్
రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి చాలా సమయమే ఉంది. కానీ నేతలు మాత్రం ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. తమ నియోజకవర్గం.. పార్టీ, క్యాడర్ రెడీ చేసుకుంటున్నారు. కొందరు టికెట్ కన్ఫామ్ కాక ముందే ప్రచారం చేసుకుంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications