టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య: ఫ్రెండ్ ప్రియురాలితో సన్నిహితంగా, చివరకు బలవన్మరణం

నెల్లూరు: జిల్లా కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ 23ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి ప్రేమ వ్యవహారంతోపాటు స్నేహితులు దాడి చేయడం కారణంగాతెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

స్నేహితుడి లవర్‌తో సన్నిహితంగా..

స్నేహితుడి లవర్‌తో సన్నిహితంగా..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రంగనాయకులపేటకు చెందిన షేక్ రఫి. ఇతడు ప్రైవేటు కార్యక్రమాలను వీడియో తీస్తుంటాడు. అంతేగాక, టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ ఆ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. కాగా, ఇతని స్నేహితుడు నారాయణరెడ్డిపేటకు చెందిన ముస్తఫా. ఓ యువతిని ముస్తాఫా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం రఫికి కూడా తెలుసు. అయితే, రెండు నెలలుగా ఆ యువతి, రఫీ చనువుగా ఉంటున్నారు.

ప్రియురాలితో ఉండగా ఫోన్ చేసి దాడి..

ప్రియురాలితో ఉండగా ఫోన్ చేసి దాడి..

ఈ నేపథ్యంలో స్నేహితులిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. జనవరి 20న రఫి ఆ యువతితో కలిసి మనుబోలులోని ఓ ప్రాంతానికి వెళ్లారు. అది తెలిసి ముస్తాఫా ఆ యువతికి ఫోన్ చేసి ఆరా తీశాడు. దీంతో రఫితో టీ తాగేందుకు వచ్చానని చెప్పింది.

ఈ క్రమంలో రఫిని తీసుకుని వస్తే ఈవెంట‌కు సంబంధించిన నగదు ఇస్తానని చెప్పాడు. దీంతో వారిద్దరూ అతడి వద్దకు వచ్చారు. కాగా, ముస్తాఫా, మరికొందరు స్నేహితులు రఫిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన రఫీని అతని తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనపై ముస్తాఫా దాడి చేశాడని తన తండ్రికి రఫి చెప్పాడు. దీంతో జనవరి 21న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

    Nellore: కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు SI Baji Reddy | Kodi Pandalu
    ముస్తాఫా బెదిరింపుతోనే రఫి ఆత్మహత్య

    ముస్తాఫా బెదిరింపుతోనే రఫి ఆత్మహత్య

    కాగా, ముస్తాఫా బెదిరింపుల కారణంగా తన కుమారుడు రఫి ఉరివేసుకున్నాడని రఫీ తండ్రి ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే అంతుచూస్తానని బెరించడంతో భయపడి జనవరి 22న రాత్రి రఫి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నిందితుడు ముస్తాఫాపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+