నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు అక్కడికక్కడే మృతి...

|
Google Oneindia TeluguNews

నెల్లూరులో ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లకందుకూర్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ చేపల చెరువులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీ కాంతమ్మ(45), అబ్బుకోటి పెంచలయ్య(60), తాంధ్రా వెంకటరమణమ్మ (19)లుగా గుర్తించారు. మృతులంతా వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది.

ట్రాక్టర్‌లో వీరంతా సమీప గ్రామంలోని పుచ్చకాయ తోటల్లో పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్ట కూటి కోసం కూలీ నాలీ చేసుకుని బతికే బడుగు జీవులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

nellore five died on the spot after a tractor falls into a pond

Recommended Video

Covid-19 : Corona Second Wave Fear In Nellore District Of Andhra Pradesh

ఇదే నెల్లూరు జిల్లాలో మంగళవారం(మే 4) మర్రిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొంగూరు కండ్రిక సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Five killed after a tractor accidentally fell into a fish pond near Gollakandukur in Nellore district. Five people died on the spot in the accident. The deceased have been identified as Paka Krishnaveni (26), Kilari Haribabu (43), Lali Lakshmi Kantamma (45), Abbukoti Penchalaya (60) and Tandhra Venkataramanamma (19).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X