టీడీపీకి షాక్ ... ఆ కీలక నేత జంప్ తో మారనున్న నెల్లూరు రాజకీయాలు

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. టిడిపి నుండి ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై చెప్పారు అంతుబట్టని పరిస్థితి తయారైంది. ఇప్పటికే చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పార్టీ వీడి వెళ్లనున్న నేతలను నానా తంటాలు పడుతుంటే, సడన్ గా నెల్లూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగానే కాకుండా పార్టీ నిర్వహణకు సదా సిద్ధమంటూ నిన్నటిదాకా టిడిపి కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ , బీసీ నేత బీద మస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పడం చంద్రబాబు షాకింగ్ న్యూసే.

 నెల్లూరు జిల్లాలి టీడీపీకి షాక్ ఇచ్చిన బీఎంఆర్

నెల్లూరు జిల్లాలి టీడీపీకి షాక్ ఇచ్చిన బీఎంఆర్

నెల్లూరు జిల్లా కీలక నేత బీద మస్తాన్ రావు వైసిపి లో చేరడానికి రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. నేడు ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ నుండి మంచి గుర్తింపు ఉన్న నేత అయిన బీఎంఆర్ పార్టీని వీడటం టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో లోక్ సభ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన బీద మస్తాన్ రావు

గత ఎన్నికల్లో లోక్ సభ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన బీద మస్తాన్ రావు

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బీద మస్తాన్ రావు పెద్దదిక్కుగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 1,48,571 ఓట్ల తేడాతో పరాజయం పాలు అయ్యారు. అయితే, ఆ తర్వాత తన రాజకీయల్లో మార్పు వచ్చింది. ఆయనను మత్సకార సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన అన్నంత పని చేశారు.

పార్టీకి ఆర్ధికంగా బాసటగా ఉన్న బీఎంఆర్

పార్టీకి ఆర్ధికంగా బాసటగా ఉన్న బీఎంఆర్

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బీద సోదరులైన బీద మస్తాన్ రావు, బీద రవిచంద్ర లకు మంచి గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం కీలకంగా పనిచేసిన నేతలుగా స్థానికంగా వారికి మంచి పేరుంది ఇతర రాజకీయ పార్టీలకు ఏమాత్రం లొంగని నేతలుగా ఉన్న బీద సోదరులు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యత అంతా తమ భుజస్కంధాలపై వేసుకుని పార్టీని ముందుకు నడిపించారు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు.

గత ఎన్నికల దెబ్బకు ఆర్ధికంగా దెబ్బ తిన్న మస్తాన్ రావు

గత ఎన్నికల దెబ్బకు ఆర్ధికంగా దెబ్బ తిన్న మస్తాన్ రావు

ఇక పార్టీ నుండి పెద్దగా ప్రయోజనాలేమీ అందుకోలేక పోయారు బీద సోదరులు. మస్తాన్ రావుకు ఓ సారీ ఎమ్మెల్సీ, రవిచంద్రకు ఓ దఫా ఎమ్మెల్యే గా అవకాశం దక్కింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనన్నా చంద్రబాబు పట్టుబట్టి మరీ మస్తాన్ రావును అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ ఎన్నికల్లో మస్తాన్ రావు ఓటమిపాలు కావడంతో ఆయన ఆర్థికంగా బాగా చితికి పోయారు.ఇక ఈ సమయంలో చంద్రబాబు తనకు వెన్నుదన్నుగా నిలుస్తారని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

వైసీపీ నుండి బంపర్ ఆఫర్ .. అందుకే జంప్

వైసీపీ నుండి బంపర్ ఆఫర్ .. అందుకే జంప్


ఇక దీంతో వైసీపీ నుంచి ఆఫర్ రాగానే బీద మస్తాన్ రావు టిడిపికి రాజీనామా చేశారని టాక్ వినిపిస్తుంది. బీద మస్తాన్ రావు పార్టీ మార్పు విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చక్రం తిప్పినట్లుగా తెలుస్తుంది. విజయ్ సాయి రెడ్డి నుండి వచ్చిన ఆఫర్ కు ఓకే చెప్పిన క్రమంలోనే మస్తాన్ రావు టిడిపికి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తుంది. వైసీపీలో చేరిన వెంటనే మస్తాన్ రావుకు రాజ్యసభ సభ్యుడిగా బంపర్ ఆఫర్ ఇవ్వనున్న ట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా నెల్లూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన కీలక నేత బిఎంఆర్ పార్టీ మారడం నిజంగా తెలుగుదేశం పార్టీకి షాకింగ్ అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+