నిజామాబాద్ యువకుడి టిక్‌టాక్ ఫీట్స్... పోంగుతున్న వాగులో సాహసం! చివరికి...

టిక్‌టాక్ సరదా మరోయువకుడి ప్రాణం తీసింది...ఉప్పోంగుతున్న వాగుల్లో టిక్‌టాక్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న ముగ్గురు యువకుల ఆలోచనలతో సాహసం గాడి తప్పి చనిపోయాడు.. వాగులో టిక్‌టాక్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా పెరిగిన నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల గాలింపు చర్యల తర్వాత వాగులో కొట్టుకుపోయిన యువకుడి శవం లభ్యమైంది.

టిక్‌టాక్ మాయలో ఇప్పటికే అనేక మంది యువతి, యువకులు మృత్యువాత పడుతున్న టిక్‌టాక్‌ చేస్తున్న వారిలో మార్పులు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా టిక్‌టాక్ సరదా మరో యువకుడి ప్రాణం తీసింది. గత రెండు మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఉదృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు,వంకలు జలకళను సంతరించుకున్నాయి.ఈ దీంతో నీటీ ప్రవాహంలో టిక్‌టాక్ చేయాలనే అలోచనతో జిల్లాలోని భీగంల్ మండలానికి చెందిన దినేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం కప్పులవాగు చెక్‌డ్యాంకు చేరుకుని ఉదృతంగా పోంగుతున్న వాగులో టిక్‌టాక్ చేశారు.

Nizamabad youngsters tiktok fits causes death

అయితే టిక్‌‌టాక్ ప్రయత్నంలో భాగంగా ముగ్గురు యువకులు వాగులో పాటలకు అనుగుణంగా ఒక్కొక్కరుగా స్టెప్పులు వేశారు. అనంతరం కాజ్‌వే పై నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో దురదృష్టవశాత్తు ముగ్గురు యువకులు వాగులో జారిపడి కొట్టుకుపోయారు. అయితే వాగులో కొట్టుకుపోయిన యువకుల్లో ఒకరికి ఈత రావడంతో తనను తాను కాపాడుకోవడంతో పాటు మరో యువకున్ని సైతం కాపాడాడు. దినేష్ మాత్రం వాగులో కొట్టుపోయాడు... దీంతో అప్రమత్తమైన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా రెండు రోజుల క్రితం వాగులో కొట్టుకుపోయిన దినేష్ మృతదేహం నేడు ఉదయం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+