యువతిని వేధించిన పోకిరీలు.. తోటలో చితక్కొట్టిన బంధువులు (వీడియో)
ఒంగోలు : మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థినుల పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీలోని ఒంగోలులో కూడా కొందరు వేధింపులకు గురిచేశారు. దీంతో తమ పేరెంట్స్‌కు విషయం తెలుపడంతో .. యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇంకొసారి ఇలా ప్రవర్తిస్తే తాట తీస్తామని బెదిరించారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ యువతిని కొందరు వేధించారు. ఆమె ఇంటర్ చదువుతుంది. సింగరాయకొండ డ్రైవర్ పేటకు చెందిన ఎస్కే సుభాని, చిన్ను వేధించడంతో యువతి పేరెంట్స్‌కు విషయం చెప్పింది. దీంతో వారు బంధువులకు జరిగిన ఘటన గురించి తెలిపడంతో .. వారు రంగంలోకి దిగారు. గత నెల 30వ తేదిన సుభాని, చిన్నును సింగరాయకొండ జామాయిల్ తోటలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వారిలో బైరాగి మాన్యంకు చెందిన శివ, రియాజ్, బ్రహ్మ ఉన్నారు. యువతిని వేధిస్తారా అని పట్టుకొని దాడిచేశారు. కొట్టొద్దని వారించినా .. వినలేదు. తమను కొట్టొద్దని యువకులు మొత్తుకున్నా కనికరించలేదు. వారు దాడి చేయడంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. వద్దు అని ప్రాధేయపడినా వినలేదు.

యువతి బంధువులు యువకులపై దాడిచేసిన ఘటనకు సంబంధించి వీడియో కూడా తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారు. సుభాని, చిన్నుపై దాడిచేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏదైనా ఘటన జరిగితే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప .. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొవద్దని సూచిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications