పతీ సేవలో సతీ: భర్త విగ్రహాం, రోజూ పూజలు, వీకెండ్‌లో అన్నదానం..

మూడు అడుగులు వేసి.. ఏడు అడుగులు నడిచిన భార్య.. కడవరకు తోడు ఉంటానని చెప్పింది. కానీ ఆ భర్త మధ్యలోనే వదిలివెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో పతీ కన్నుమూశాడు. ఆ సతీ.. తన పతీని గుండెల్లో దాచుకోవడమే కాదు.. అతని కోసం ఏకంగా గుడి కట్టింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇదీ మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన భర్తపై ప్రేమను వివాహిత ప్రపంచానికి చాటారు.

అర్ధాంతరంగా తనువు చాలించి..

అర్ధాంతరంగా తనువు చాలించి..

కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఆ భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. భర్తను దైవంగా భావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలు అందిస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కానీ అతనిని పద్మావతి మరచిపోలేకపోయింది. ప్రతీ రోజూ బాధపడేది. ఇక లాభం లేదు అనుకుంది. అతని కోసం గుడి కట్టించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా కట్టించి.. పూజలు చేస్తోంది.

అంకిరెడ్డి స్మరణలో..

అంకిరెడ్డి స్మరణలో..

భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ ఉంటోంది. భర్త మాదిరి పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే.. సమాజ సేవకులకు సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్‌ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అలా భర్తను సేవిస్తూ తన ప్రేమను చాటుకుంటోంది. పద్మావతి చేసే మంచి పనిని పలువురు అభినందిస్తున్నారు. ఆపన్నులకు అన్నదానం చేయడం నిజంగా విశేషం. చాలా మంచి పని అందరూ కీర్తిస్తున్నారు.

రోదించి..

రోదించి..


తన భర్త చనిపోయాడని పద్మావతి గుండెలు పగిలేలా రోదించింది. ప్రతీ నిత్యం అతనినే స్మరించింది. అతనికి గుడి కట్టిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. వెంటనే నిర్మాణం ప్రారంభించింది. ప్రతీ రోజు పూజలు చేస్తే.. వీకెండ్ అన్నదానం చేస్తోంది. దీంతో పేదలు/ యాచకుల కడుపు నిండుతోంది. వారి పాలిట పద్మావతి చేసిన మంచి పని వరంగా మారింది. నలుగురి కడుపునింపే సత్కార్యం చేసి.. శభాష్ అనిపించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+