సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టప్.. టప్... గన్ ఫైర్ చేసి 43.50 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు.. సిద్దిపేటలో కలకలం

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కాల్పుల కలకలం రేపింది. ఓ దుండగుడు గన్ ఫైర్ చేశారు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చేర్యాల‌కు చెందిన నర్సయ్య అనే రియల్టర్ డ్రైవర్ కాలుపై గన్‌తో కాల్చి పరారయ్యారు. కారులో బ్యాగ్‌లో ఉన్న 43 లక్షల 50 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. నంబర్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి మరీ డబ్బును ఎత్తుకెళ్లారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

 రిజిస్ట్రేషన్ ఉండగా..

రిజిస్ట్రేషన్ ఉండగా..

ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఉండగా నర్సయ్య రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. కారులో డ్రైవర్ కూర్చొని ఉండగా అద్దాలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకుని వెళ్లినట్లు రియల్టర్ నర్సయ్య చెప్పారు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. గద్దలా వచ్చి నగదును తీసుకెళ్లి.. పోలీసులకు సవాల్ విసిరారు. ఘటనా స్థలానికి సీపీ వచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. ఆ ఇద్దరు పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. నగదను తీసుకెళ్లింది ఎవరూ... రిజిస్ట్రేషన్ అవుతుందని వారికేం తెలుసు అనే సందేహాలు కలుగుతున్నాయి.

మాజీ సర్పంచి కూడా..

మాజీ సర్పంచి కూడా..

నర్సయ్య.. రియల్టరే గాక.. దొమ్మాట మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. తన స్థలాన్ని విక్రయించాలని అనుకున్నాడు. సిద్దిపేటకు చెందిన టీచర్ శ్రీధర్ రెడ్డికి విక్రయించేందుకు అంగీకారం కూడా జరిగింది. భూమికి సంబంధించి 64.24 లక్షలు చెల్లించాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సోమవారం కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో శ్రీధర్ రెడ్డి నగదు కూడా ఇచ్చారు. ఆ మొత్తాన్ని కారు డ్రైవర్ పరశురామ్‌కు ఇచ్చి కారులో కూర్చొవాలని చెప్పి.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లారు.

Recommended Video

CCTV : దుకాణాల్లో పని కోసం వచ్చి నగదు చోరీ!! | Tirupati | Oneindia Telugu
అద్దాలు పగులగొట్టి మరీ

అద్దాలు పగులగొట్టి మరీ

ఆ సమయంలో ఇద్దరు వచ్చి కారు అద్దాలు పగులగొట్టారు. అప్రమత్తమైన డ్రైవర్ కారును ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. ఒకతను తుపాకీతో డ్రైవర్ ఎడమకాలిపై కాల్చాడు. మరొకడు సీట్‌లో ఉన్న నగదు సంచిని తీసుకెళ్లాడు. గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసు కమిషనర్ శ్వేత అక్కడికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్టు వివరించారు.

English summary
two fellows theft rs.43.50 lakh cash at siddipet registration office. 18 police groups search started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X