King Cobra: శ్రీకాకుళం జిల్లాలో హల్‍చల్ చేసిన భారీ కింగ్ కోబ్రా.. చూస్తే వణికిపోవాల్సిందే..
పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. అక్కడ పాము ఉందంటే అటు పక్కకు వెళ్లరు. చిన్న పాములకే మనం ఇంతగా భయపడితే కింగ్ కోబ్రా లాంటి పామును దగ్గరగా చూస్తే ప్రాణాలే పోతాయి. అయితే ఇండియాలో కింగ్ కోబ్రాలు చాలా తక్కువ. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా కింగ్ కోబ్రాలు ఉంటాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది.

బుసలు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్లా గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రాను చూసిన జనం హడలిపోయారు. ఈ రాచ నాగు గ్రామానికి చెందిన దుర్యోదన చౌదరి ఇంట్లోకి వచ్చింది. బుసలు కొట్టడంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే సోంపేటలో పాములు పట్టేవారికి సమాచారం అందించారు.

విష సర్పాలు
వారు వచ్చి 12 అడుగుల కింగ్‌కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ పామును అటవీశాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల మండల పరిధిలోని బొగాబెణి, జలతంత్రకోట, కుంబరినౌగాం, ముండ్లా, పోలేరు తదితర అటవీ ప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు, విష సర్పాలు, బీరీ కొండ చిలువలు సంచరిస్తున్నాయని అటవి అధికారులు తెలిపారు.
వీడియో వైరల్
దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కింగ్ కోబ్రా విషానికి పవర్ ఎక్కువగా ఉంటుందట. ఇది కాటు వేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కింగ్ కోబ్రా పట్టుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications