సరిరారు నాకెవ్వరు: ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన 6లక్షల మేకపోతు!!

నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ లో మూడేళ్ళ వయసున్న ఒక మేకపోతు ప్రథమ బహుమతిని గెలుపొందింది.

మనుషులకే కాదు జంతువులకు పోటీలు ఉంటాయి. ఇక ఆ పోటీలలో సరిరారు నాకెవరు అంటూ హొయలు పోయింది ఓ మేకపోతు. అతి చిన్న వయసులోనే భారీ దేహంతో, ఒళ్లంతా అందమైన తెల్లని ఊలుతో, గంభీరమైన రూపంతో చూసిన ప్రతి ఒక్కరిని ఔరా అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ లో బరువు విభాగంలో ప్రథమ బహుమతిని గెలుపొందింది.

గొర్రెలు, మేకపోతులకు సంబంధించి భారీ ప్రదర్శన ఇక్కడ జరగగా ఆ ప్రదర్శనలో ఓ మేకపోతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 110 కిలోల బరువు 3 ఏళ్ల వయసు ఉన్న మేకపోతు, శరీరంపై ఎటువంటి నల్లని మచ్చలు లేని జమునా పారి మేకపోతు ఫస్ట్ ప్రైస్ కొట్టేసింది. ఇక ఈ మేకపోతు రాజస్థాన్ కు చెందినది. దీనిని శంకర్ కిచెన్ అనే రైతు పెంచుతున్నారు. 110 కిలోల బరువున్న ఈ మేకపోతు విలువ అక్షరాల ఆరు లక్షల రూపాయలు. ఇక ఈ ఫెయిర్ కు వచ్చిన వాళ్లంతా ఆ మేకపోతుని చూసి, చిన్న వయసులో 110 కిలోల బరువు, ఎత్తు, ఒళ్లంతా చక్కని ఊలుతో దిట్టంగా ఉన్న దాని తీరును చూసి దాని వివరాలు కనుకుంటున్నారు. ప్రతిరోజు దానికి ఆహారంగా ఏం పెడతారు? దాని జీవనశైలి ఎలా ఉంటుంది అని ఆ రైతును వివరాలడిగి తెలుసుకుంటున్నారు.

110 kgs 6 lakhs worth goat won first prize in National Goat Fair and Exhibition

నేషనల్ గోట్ ఫెయిర్ మరియు కిసాన్ గోష్టి సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మఖ్దూం ఫరా మధురలో నిర్వహించబడింది. దీనిని చక్కెర మరియు చెరకు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి చౌదరి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ లోని శాస్త్రవేత్తలు, అధికారులు, ఉద్యోగులతో పాటు, వివిధ కౌన్సిల్ ఇన్స్టిట్యూట్లకు చెందిన ప్రతినిధులు, దాదాపు 1000 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, రైతులు, మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్ ఫేస్ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు తెలంగాణా రాష్ట్రం నుంచి కూడా చాలామంది గోట్స్ ఫామ్ యజమానులు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో గొర్రెలు, మేకల జీవాల సంపద పెరిగిన కారణంగా వాటిపై పరిశోధనలు చేయడానికి, జాతీయ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని వారు అక్కడ సదస్సులో మాట్లాడినట్టు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+