శుభవార్త.. త్వరలోనే వారి ఖాతాల్లో రూ.5 లక్షలు!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో దృష్టి సారించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని మాటిచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై ప్రభుత్వం కసరత్తు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి ఉచితబస్సు ప్రయాణాన్ని, 200యూనిట్ల లోపు ఉచిత కరెంటు సదుపాయాన్ని, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తోంది. ఇక ఇదే సమయంలో తాజాగా మరొక హామీని నిలబెట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి పెద్ద కొంతకాలంగా కసరత్తు చేస్తుంది.

ఇందిరమ్మ ఇళ్ళ పథకం కోసం నిరీక్షణ
ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ సొంత స్థలం ఉన్న పేదవారికి ఇల్లు నిర్మాణం చేయడం కోసం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. అయితే ఈ పథకం అమలు కోసం ఇల్లు లేని నిరుపేదలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ తొలి వారంలో ఈ పథకాన్ని అమలు చేస్తారని భావించినప్పటికీ అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.
కీలక విషయం చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్
తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాన్ని వెల్లడించారు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇళ్లు మంజూరు చేసిందని త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు పూర్తి పారదర్శకంగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేస్తామని ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండబోదని ఆయన తెలిపారు.
5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం త్వరలోనే
మొదటి విడతలో ఖాళీ స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు 400 చదరపు అడుగుల కొత్త ఇల్లు నిర్మించుకోవాలని, లబ్ధిదారునికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు, నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు.
మంత్రుల ప్రకటనలతో నిరుపేదల ఆశలు
మొత్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఖచ్చితమైన తేదీ ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో నేడు రేపు అంటూ ఇల్లు కట్టుకోవాలి అనుకునే నిరుపేద లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications