ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనగిరి: యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై వరంగల్‌ వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

accident

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ గిరి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా..

బాహుపేట రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
5 persons died and more 3 persons seriously injured in a road accident which occured on Hyderabad-Warangal National High Way here in Bahupet of Yadagirigutta Mandal of Nalgonda District. This accident occured while Vajra RTC bus and an Auto coming in opposite direction. DCP giri came to spot and taking necessary action. On the other hand Transport Minister Mahendar Reddy also enquired about this accident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి