కట్నం తక్కువైందని పెళ్ళికి నిరాకరించిన వధువు: వరుడు షాక్; తెలంగాణాలో కట్నం సీన్ రివర్స్!!
వరుడు ఇచ్చే కట్నం సరిపోదని ఓ వధువు ముహూర్తానికి ఒక గంట ముందు పెళ్లికి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మేడ్చల్ జిల్లా: కట్నం... దేశవ్యాప్తంగా అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు కట్నం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. చట్ట ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమే అయినప్పటికీ, ఈ కట్నాలు, కానుకల తంతు అనధికారికంగా ప్రతి పెళ్లిలోనూ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కట్నం విషయంలో సీన్ రివర్స్ అయింది.

కట్నం సరిపోలేదని పెళ్లి నిరాకరించిన వధువు
ఒకప్పుడు అమ్మాయిలే అబ్బాయిలకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు పోయి, ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలే కట్నాలు ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ విషయం తాజాగా జరిగిన ఒక సంఘటనతో వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే వరుడు ఇచ్చే కట్నం సరిపోదని ఓ వధువు ముహూర్తానికి ఒక గంట ముందు పెళ్లికి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.

వధువుకి కట్నంగా రెండు లక్షల రూపాయలిచ్చిన వరుడి కుటుంబం
మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన యువకుడికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కు చెందిన యువతితో పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. ఇక కట్నం క్రింద అమ్మాయికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇరు వర్గాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి కట్నంగా రెండు లక్షలు ఇవ్వడానికి ఓకే అన్నారు. అనుకున్నదే తడవుగా అమ్మాయికి కట్నం డబ్బుల క్రింద రెండు లక్షల రూపాయలను కూడా వరుడి కుటుంబ సభ్యులు ముట్టజెప్పారు. ఇక పెళ్లి పత్రికలు అందరికీ పంచి బంధుమిత్రులను ఆహ్వానించారు. వరుడుతో పాటు, వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు.

పెళ్ళికి గంట ముందు వధువు సూపర్ ట్విస్ట్ ... అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి అంటూ డిమాండ్
గురువారం రాత్రి 7 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా వరుడికి, వరుడు కుటుంబానికి షాక్ ఇస్తూ వధువు వరుడు కుటుంబం ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనపు కట్నం ఇస్తే పెళ్లి పీటల మీద కూర్చుంటానంటూ తేల్చి చెప్పింది. ఇంకో గంటలో పెళ్లి ఉందనగా తనకి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. దీంతో వరుడి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి కోసం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు కూడా వదిలేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు.

తెలంగాణాలో రివర్స్ అయిన కట్నాల సీన్..
ఒకప్పుడు అబ్బాయిల విషయంలోనే ఇటువంటి ఘటనలు వినేవాళ్ళం. అదనపు కట్నం కోసం అబ్బాయిలు వధువు కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసిన అనేక ఘటనలు మనం విన్నాం. కానీ అందుకు భిన్నంగా వరుడు కుటుంబం ఇచ్చే కట్నం నచ్చలేదని, అదనపు కట్నం కావాలని వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఘటనను మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నాం. ఇక ఈ పరిణామాన్ని విన్నవారు ఒకింత ఆశ్చర్యానికి, అదే సమయంలో అయోమయానికి కూడా గురవుతున్నారు. తెలంగాణలో కట్నాల సీన్ రివర్స్ అయిందని, అమ్మాయిలకు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఈ ఘటనను విన్న కొందరు చర్చిస్తున్న పరిస్థితి ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications