బీజేపీలో కీలక పరిణామం; తెలంగాణాలోనూ సంస్థాగత మార్పులు మొదలెట్టిన బీజేపీ హైకమాండ్
దేశవ్యాప్తంగానూ బీజేపీలో సంస్థాగత మార్పులు చేయాలని, 2024 ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాషాయ జెండా ఎగరవెయ్యాలని ఇప్పటి నుండి బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో సంస్థాగత మార్పులను చేయాలని నిర్ణయించుకున్న మేరకు బిజెపి జాతీయ నేతలు వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

హైకమాండ్ నిర్ణయం ... తెలంగాణా బీజేపీలో కీలక పరిణామం
అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థాగత మార్పులో భాగంగా తెలంగాణ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీని మారుస్తూ బిజెపి అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది.

తెలంగాణా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీని మార్చిన బీజేపీ హైకమాండ్
తెలంగాణ ప్రస్తుత ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాసులును బిజెపి జాతీయ నాయకత్వం పంజాబ్ కు బదిలీ చేసింది. అలాగే నాలుగు రాష్ట్రాలకు ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ లను మారుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ లో ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా అజయ్ జంబ్వాల్, కర్ణాటక ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా రాజీవ్ దివి, పశ్చిమ బెంగాల్ జాయింట్ జనరల్ సెక్రటరీగా సతీష్ దొంద, ఇక పంజాబ్ కు మంత్రి శ్రీనివాసులును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణాకు ఎవరికి బాధ్యత అప్పగిస్తారో? సంస్థాగత మార్పులపై బీజేపీలో చర్చ
ఇదిలా ఉంటే తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకాన్ని జేపీ నడ్డా ఇప్పటివరకూ పూర్తి చేయలేదు. పార్టీలో సంస్థాగతంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి కీలకం కావడంతో సంస్థాగతమైన మార్పులు చేస్తున్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఎవరిని నియమిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణా పై దృష్టి పెడుతున్న క్రమంలో ఎవరికి కీలక బాధ్యత అప్పగించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగానూ బీజేపీలో సంస్థాగత మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు అన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో పార్టీలో సంస్థాగత మార్పులలో ఎవరి పదవికి ఎసరు పడుతుంది, కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది చర్చకు వస్తుంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications