ఆరా ఎగ్జిట్ పోల్స్: హస్తందే హవా.. జిల్లాల వారీగా లెక్కలివే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఏ పార్టీ హవా కొనసాగుతుంది అన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఇక ఆరా సంస్థ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ తేల్చి చెప్పింది.
Recommended Video

కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాలలో విజయం సాధించబోతుందని, బీఆర్ఎస్ 44 నుండి 49 స్థానాల వరకు దక్కించుకోబోతుందని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో వెల్లడించింది. బిజెపి 5 నుండి 7 స్థానాలలో విజయం సాధిస్తుందని, ఇతరులు 7 నుండి 9 స్థానాలు కైవసం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించిన ఆరా సంస్థ జిల్లాల వారీగా ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా పార్టీలు సాధించబోయే సీట్ల సంఖ్యను పేర్కొంది. ఉమ్మడి హైదరాబాద్లో లోని 15 నియోజకవర్గాలలో కాంగ్రెస్ 1 నుండి 2 స్థానాలు, బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు కైవసం చేసుకుంటుందని, బిజెపి 1, ఎంఐఎం 6 నుండి 7 స్థానాలు సాధిస్తాయని పేర్కొంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14స్థానాలలో కాంగ్రెస్ 6 నుండి 7, బి ఆర్ ఎస్ 7 నుండి 8, బిజెపి 1 దక్కించుకుంటాయని పేర్కొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10స్థానాలలో కాంగ్రెస్ 5 నుండి 6, బీఆర్ఎస్ 4 నుండి 5స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9స్థానాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 3 నుండి 4స్థానాలు దక్కించుకుంటాయని, బిజెపి 2 నుండి 3స్థానాలు పొందుతుందని పేర్కొంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 స్థానాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు 3 నుండి 4 స్థానాలు దక్కించుకుంటాయని, బిజెపి 2 స్థానాలు పొందుతుందని, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకుంటారు అని పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 స్థానాలలో కాంగ్రెస్ 5 నుండి 6, బీఆర్ఎస్ 6 నుండి 7, బిజెపి 0 నుండి 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 స్థానాలలో కాంగ్రెస్ 8 నుండి 9, బీఆర్ఎస్ 5 నుండి 6 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలలో కాంగ్రెస్ 9 నుండి 10 స్థానాలు, బీఆర్ఎస్ కు 2 నుండి 3 స్థానాలు వస్తాయని పేర్కొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలలో కాంగ్రెస్ 7 నుండి 8, బీఆర్ఎస్ 4 నుండి 5 స్థానాల్లో గెలుస్తాయి అని పేర్కొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలలో కాంగ్రెస్ 8 నుండి 9, బీఆర్ఎస్ 0 నుండి 1, ఇతరులు 1 స్థానాలు దక్కించుకుంటాయని ఆరా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications