వేటకు మూలకారకుడు అక్బర్‌ఖానే!: తేల్చిన పోలీసు, అటవీ శాఖ అధికారులు

Subscribe to Oneindia Telugu

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ అడవుల్లో దుప్పుల వేట జరిగి తొమ్మిది రోజులు గడిచినా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఆదివారం అదనపు పీసీసీఎఫ్‌(విజిలెన్స్‌) స్వర్గం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఘటన జరిగిన ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టారు.

అక్బర్‌ఖాన్‌ (ఏ 4) ఇంటి వద్ద సోదాలు నిర్వహించారు. సోమవారం అటవీశాఖ డీఎఫ్‌వో(విజిలెన్స్‌) రాజశేఖర్‌ ఆధ్వర్యంలో మహదేవ్‌పూర్‌కు చెందిన నిందితుడు గట్టయ్య ఇంటిలో, సమీప ప్రాంతాల్లో సోదాలు జరిపారు. కారు, సెల్‌ఫోన్‌, అనుమానాస్పదంగా ఉన్న వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

కళ్లెదుటే ఉన్నా...
వేటకు మూలకారకుడు టీఆర్ఎస్ నాయకుడు, జడ్పీటీసీ సభ్యురాలి భర్త అక్బర్‌ఖానేనని అధికారులు నిర్ధారించారు. వేటకు హైదరాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి ప్రాంతాల నుంచి వేటగాళ్లను ఆహ్వానించింది ఇతనేనని స్పష్టం చేశారు. ఘటన జరిగిన రోజు నుంచి కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు.

Akbar khan is main accused in Deer hunting case

ఓ పోలీసు అధికారి, అటవీ సిబ్బంది సైతం సహకరించడం వల్లే సంఘటన తర్వాత మూడురోజుల పాటు స్థానికంగానే ఉన్నాడు. అసలు నిందితుడు అక్బర్‌ఖానేనని అరెస్టైన ముగ్గురు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. ఇది ముందుగానే పసిగట్టిన అక్బర్‌ఖాన్‌ పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు. ఆది నుంచి ఈ కేసులో కీలక వ్యక్తి అతనే అని ఆరోపణలు వచ్చినా అధికారులు వినిపించుకోలేదు. ఇప్పుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెబుతున్నారు.

ప్రత్యేక బృందాలతో గాలింపులు
నిందితుల కోసం పోలీసు శాఖ ప్రత్యేక బృందాలను హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాలకు పంపించింది. ఇప్పటి వరకు మిగిలిన ఆరుగురు నిందితుల్లో ఎవరినీ పట్టుకోలేదు. వేటలో పది మంది పాల్గొన్నట్లు అధికారులు తేల్చారు. తొమ్మిది మంది పేర్లు వెల్లడించగా, మరొకరు నలువాల సత్యనారాయణ బంధువుగా పేర్కొన్నారు. ఇతను 14 ఏళ్ల బాలుడని, నేరం చేసే ఉద్దేశంతో రాలేదని, అందుకే అతని పేరును చార్జిషీటులో నమోదు చేయలేదని అంటున్నారు.

వారి సహకారంతోనే?
మొదటి నుంచి కేసు దర్యాప్తునకు సంబంధించిన ప్రతి విషయం అక్బర్‌ఖాన్‌కు చేరవేసేందుకు పోలీసు, అటవీ శాఖల్లో కొందరు ఉన్నట్లు సమాచారం. తాము వేసే ప్రతి అడుగు నిందితులకు తెలిసిపోతోందని స్వయంగా విచారణ అధికారే తెలపడంతో నిందితులకు.. అధికారులు ఏ మేరకు సహకరిస్తున్నారో తెలుస్తుంది.

ఎంపీపీపై అనర్హత వేటు

జగిత్యాల జిల్లా మేడిపల్లి ఎంపీపీ పల్లి జమునపై అనర్హత విధిస్తూ జగిత్యా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ సోమవారం తీర్పు చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టం 1994, సెక్షన్‌ 19(3) లోని మూడో సంతానం నిబంధనను ఉ్లంఘించి ఎన్నికల్లో పోటీ చేసినందున ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జమునతోపాటు పోటీ పడి ఎంపీటీసీ సభ్యు మద్దతులో ద్వితీయ స్థానం సాధించిన అన్నపూర్ణనను ఎంపీపీగా ప్రకటించారు.

మేడిపల్లి మండం బీమారం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన పల్లి జమున మెజారిటీ సభ్యు మద్దతుతో మూడేళ్ల క్రితం ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలో ఎంపీపీ పదవి కోసం పోటీ పడిన మేడిపల్లి1 ఎంపీటీసీ సభ్యురాలు కుందారపు అన్నపూర్ణ... జమునపై కోర్టులో పిటిషన్‌ దాఖు చేశారు. పంచాయతీరాజ్‌ చట్టం 1994 నిబంధనను అతిక్రమించి మూడో సంతానం కలిగి ఉన్నా పోటీలో నిలిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్ష్యాధారాను పరిశీలించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌.. ఎంపీపీని అనర్హురాలిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police officers said that Akbar khan is main accused in Deer hunting case in Mahadevpur.
Please Wait while comments are loading...