ఆల్ టైం రికార్డ్... బాలాపూర్ లడ్డును మించి.. 1.87కోట్ల ధర పలికిన గణేశ లడ్డు!

దేశవ్యాప్తంగా గణేశ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇక గణేష నిమజ్జనానికి ముందు దేశవ్యాప్తంగా వినాయకుడి లడ్డు వేలంపాట కొనసాగుతోంది. గణేశ నవరాత్రి వేడుకలు పూర్తి చేసుకుని దేశ వ్యాప్తంగా గణేశ శోభాయాత్రలతో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గణేశ నిమజ్జనానికి ముందు హైదరాబాద్లో ఓ చోట జరిగిన లడ్డు వేలం పాట ఆల్ టైం రికార్డును సృష్టించింది.

రికార్డు ధర పలికిన కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ లడ్డు
ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలకు మహాగణపతి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు ఓ గణేశ భక్తుడు. గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లోని గణేష్ లడ్డూ వేలం పాటలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఈ గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయల ధర పలికింది.

All time record More than Balapur Laddu Ganesha Laddu priced at 1 87Crores in keerthi richmond villas

ధనవంతుల విల్లాస్ లో అంతే రిచ్ గా గణేశ లడ్డు పాట
కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో అందరూ ధనవంతులు కావడంతో లడ్డూ వేలం పాట ఆ స్థాయిలోనే జరిగింది. ఈ సంవత్సరం రికార్డు ధరకు వినాయక లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్నారు వినాయక భక్తులు. సహజంగా హైదరాబాద్ లో లడ్డు వేలంపాట అంటే అందరికీ బాలాపూర్ గణనాథుని లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది.

బాలాపూర్ లడ్డు ధర ఇలా
ఇక గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డు ప్రసాదం వేలం 27 లక్షల ధర పలకగా, ఇక ఈ రికార్డు 2024లో ఇప్పటివరకు రెండుసార్లు బ్రేక్ అయింది. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఒక వ్యాపారవేత్త కొండపల్లి గణేష్ ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో వినాయకుడి లడ్డును 29 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు. అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డును 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి అనే భక్తుడు సొంతం చేసుకున్నాడు.

బాలాపూర్ లడ్డు ధరను వెనక్కు నెట్టేసిన కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లడ్డు
ఇదిలా ఉంటే ఈసారి బాలాపూర్ గణనాథుడి లడ్డుని, ఐటీ కారిడార్ పరిధిలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో లడ్డు వేలంపాటను వెనక్కు నెడుతూ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేష్ లడ్డు ఊహించని ధర పలికింది. ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలతో గణపతి లడ్డు ప్రసాదం తన ప్రాభవాన్ని చాటుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+