యాంకర్ ప్రదీప్ ఇష్యూ కొలిక్కి: వీడియో పోస్టు, ఏమన్నాడంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu
  Anchor Pradeep's Latest Video Going Viral, Watch యాంకర్ ప్రదీప్ 'వివరణ' వీడియో వైరల్

  హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌కు రాకపోవడంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. దానిపై ప్రదీప్ స్పందించారు.

  తాను తప్పు చేసినట్లు ప్రదీప్ అంగీకరించారు. తన మాదిరిగా ఇక ఎవరు కూడా తప్పు చేయకూడదని సూచిస్త సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను కౌన్సిలింగ్‌కు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇస్తూ మరిన్ని విషయాలను ఆ వీడియోలో ఆయన పొందుపరిచారు.

   అందరికీ నమస్కారం అంటూ...

  అందరికీ నమస్కారం అంటూ...

  "అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను" అని ప్రదీప్ అన్నారు.

   ముందు కమిట్ అయిన ప్రోగ్రామ్స్ వల్ల

  ముందు కమిట్ అయిన ప్రోగ్రామ్స్ వల్ల

  "అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను" అని అన్నారు.

  దాని వల్ల కొన్ని మిస్ అయి ఉండవచ్చు

  దాని వల్ల కొన్ని మిస్ అయి ఉండవచ్చు

  "కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను" అని ప్రదీప్ వివరణ ఇచ్చారు.

   అవును దురదృష్టవశాత్తు..

  అవును దురదృష్టవశాత్తు..

  "నిరుడు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను" అని ప్రదీప్ అన్నారు.

   ప్రదీప్ కోసం ఇలా వెతికారు..

  ప్రదీప్ కోసం ఇలా వెతికారు..

  గత డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం గైర్హాజరయ్యాడు ప్రదీప్‌ పోలీస్ కౌన్సెలింగ్‌కు గత మూడురోజులుగా హాజరు కాలేదు. దీంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీశారు. అయినా అందుబాటులోకి రాలేదు.

  ఆందోళన చెందవద్దని...

  ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోండని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం జరుగుతుండడంతో తన గురించి ఆందోళన చెందవద్దని, త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానని ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రీత్ అనలైజర్‌తో ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు వచ్చాయి. దానికితోడు ఈ స్టార్ యాంకర్ నడుపుతున్న వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్‌ ఉండటంతో ఆర్టీఐ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anchor Pradeep said in a video posted in Social media that he will follow th procedings in drunk and drive case.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి