టి నుంచి ఏపీ కాపీ, 5గురు కీలకం: టీసీఎస్ సిబ్బంది విచారణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల వెబ్ సైట్ కాపీ కేసులో ఐదుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించారు.

సీక్రెట్ కాపీ!: 'ఏపీ చోరీపై సమాధానం చెప్పలేకపోయిన తెలంగాణ'  

ఈ కేసులో ఇప్పటి వరకు టీసీఎస్, కేపీఎన్జీ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, టిసిఎస్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని విచారించారు. ర్యాంకుల కోసం ఏఏ సంస్థలను సంప్రదించారని ఏపీ పరిశ్రమల శాఖ అధికారులను పోలీసులు అడగగా.. టీసీఎస్ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.

టిసిఎస్‌తో పాటు మరో రెండు సంస్థలు కూడా ప్రతిపాదనలు అందించాయని తెలిపారు. దీంతో టీసీఎస్ సంస్థ ప్రతినిధులను పోలీస్ అధికారులు సోమవారం పిలిపించి, విచారించారు. పరిశ్రమల విధానం పైన తెలంగాణ సర్కార్ ఇంటర్నెట్లో ఉంచిన అంశాలను యథాతథంగా ఎందుకు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చారని ప్రశ్నించారు.

Andhra, Telangana fight it out over ease of doing business ranking

ఏపీ ప్రభుత్వం, టీసీఎస్, కేపీఎన్జీ సంస్థల మధ్య కుదిరిన అవగాహనఒప్పంద వివరాల కాపీలు కావాలని వారు కోరారు. కాగా, ఏపీ ప్రభుత్వం వెబ్ సైట్లో ఉంచిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. తెలంగాణ పరిశ్రమ నెట్లో ఉంచిన విధానానికి కాపీ కాదని టీసీఎస్ సిబ్బంది పోలీసులకు చెప్పారని తెలుస్తోంది.

కేసీఆర్Xబాబు: కేంద్రం వద్ద 'సీక్రెట్', అది మిలియన్ డాలర్ల ప్రశ్న

వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలకు తాము కంటెంట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ముసాయిదా, అధికార ప్రతిని తయారు చేసేటప్పుడు తాము సొంతగా రాసుకున్న విషయాల పదజాలాన్ని పరిశీలిస్తామని చెప్పారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వానిది కాపీ చేయలేదని, చాలా మార్పులు చేశామని చెప్పారని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో ఐదుగురు కీలక పాత్ర పోషించారని అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra, Telangana fight it out over ease of doing business ranking.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి