సంక్రాంతికి ఊరెళ్తున్నారా? దొంగలతో పారాహుషార్.. చోరీలకు చెక్ పెట్టండిలా!!

సంక్రాంతి పండుగకు చాలావరకు తమ సొంత ఊళ్లకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అయితే ఖాళీ అవుతుంది. దీంతో చాలా ఇళ్లకు తాళాలు పడతాయి . దాదాపుగా 12లక్షల మంది హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు వెళతారని అంచనా ఉంది. ఇక ఇదే అదునుగా చాలా కాలనీలు, అపార్టుమెంట్లలో దొంగలు వీర విహారం చేస్తారు. ఈ క్రమంలో ఊర్లకు వెళ్తున్నవారు దొంగల నుండి కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

సంక్రాంతికి ఊరు వెళుతున్న వారు దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్న క్రమంలో బంగారాన్ని లాకర్లలో పెట్టుకొని వెళ్లడం మంచిది. ఇంట్లో నగదు కూడా లేకుండా జాగ్రత్త చేసుకోవడం మరీ మంచిది. విలువైన వస్తువులను తమతో తీసుకువెళ్లడం మంచిది కానీ ఇదే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం.

 Are you going hometown for Sankranti? Check to the thefts with these tips!!

ఇక పండుగకు ఊరు వెళుతున్నవారు నమ్మకస్తులైన పక్కింటి వారికి తమ ఇంటిపై కన్నేసి ఉంచాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే తమకు కాల్ చేయాలని చెప్పి పెట్టడం మంచిది. సంక్రాంతి పండుగకు ఊరు వెళుతున్నవారు వాహనాల పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండిల్ లాక్ వేయడంతో పాటు వీల్ లాక్ కూడా చేసుకోవాలి. ఇక ఇంటిని చీకటిగా ఉంచి వెళ్ళకూడదు. కనీసం ఒక చిన్న లైట్ అయినా వేసి వెళ్ళాలి.

అలాగే ఇంటి తాళం బయట రోడ్డు మీద ఉన్న వారికి కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పని మనుషులు ఉంటే ప్రతి రోజు ఇంటి ముందు ఉడ్చి ముగ్గు పెట్టే లాగా ఉండాలి. పేపర్ వేసేవాడికి పేపర్ వేయొద్దని చెప్పాలి. వీలైతే రాత్రి వేళ ఇంట్లో పడుకునే వారు ఎవరైనా ఉంటే వారిని పడుకోమనడం మంచిది.

ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మరీ మంచిది. ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. ఊరికి వెళ్లే ముందు కిటికీలు, తలుపులు అన్ని సరిగా వేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సమీప పోలీస్ స్టేషన్లో ఊరికి వెళుతున్న విషయాన్ని తెలియజేయాలి. కాలనీలలో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాల బారిన పడకుండా మీ ఇంటిని కాపాడుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+