ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా .. నా కల నేరవేరింది: బండ్ల గణేష్
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కించుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.
రేపు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బి స్టేడియం గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తన కల అని పేర్కొన్న ఆయన తాను చెప్పినట్టుగానే జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు .

రేపే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అని చెప్పడంతో తాను సంతోషించానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీని ముందుకు నడిపించిన తీరు బాగుందని బండ్ల గణేష్ కితాబిచ్చారు. తాను ముందుగా చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈక్షణం కోసమే పదేళ్ల నుండి వెయిట్ చేస్తున్నాం - బండ్ల గణేష్#BandlaGanesh #RevanthReddy #RevanthForTelanganaCM #Congress #TelanganaCM #Oneindiatelugu pic.twitter.com/DvwP5VIoEF
— oneindiatelugu (@oneindiatelugu) December 6, 2023
తను డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణం చేస్తారని చెప్పానని కానీ రెండు రోజులు ముందే రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఈరోజు రాత్రి ఎల్బీ స్టేడియంలోనే తను ఉండిపోతానని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఈరోజు రాత్రి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతానని పేర్కొన్న బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి సీఎం కావడం పట్ల రాష్ట్రంలోని చాలామంది సంతోషంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. తనకు ఎలాంటి పదవి అక్కరలేదని పేర్కొన్న ఆయన కేవలం తాను పార్టీ కోసం పని చేశానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను దక్కించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications