బెంగళూరు రేవ్ పార్టీ ... విచారణకు నటి హేమ డుమ్మా, పోలీసులకు లేఖ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులకు నటి హేమ షాక్ ఇచ్చారు. ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉన్న హేమ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖ రాశారు.బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 86 మందికి విచారణకు రావాలని నోటీసులు పంపించిన పోలీసులు నేడు నటి హేమతో పాటు 8 మందికి విచారణకు రావాలని నోటీసులు పంపారు.
పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
ఈ క్రమంలో నటి హేమ నేడు బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాకుండా పోలీసులకు ఒక లేఖ రాశారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని చెప్పిన నటి హేమ ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని లేఖలో రాశారు. విచారణకు హాజరు కావటానికి సమయం కావాలన్నారు. ఈ లేఖను బెంగళూరు సిసిబి పోలీసులకు పంపించారు.

మళ్ళీ హేమకు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
దీంతో హేమకు మరోమారు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీ అయ్యారు. హేమ విచారణకు హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న పోలీసులు ఆమెకు మళ్లీ మరొక తేదీని కేటాయిస్తూ నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ తాను అసలు పాల్గొనలేదని ఒక వీడియో రిలీజ్ చేసి మరీ బుకాయించారు.
బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రామా
ఆ తర్వాత తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పేందుకు చికెన్ బిర్యాని ఎలా తయారు చేయాలో ఒక వీడియోని చేసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక నటి హేమ జనాలను తప్పుదారి పట్టించే క్రమంలో వీడియోలు చేస్తుందని బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారని పోలీసులు ధృవీకరించారు.
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
అంతేకాదు బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందికి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసేందుకు రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ పరీక్షలలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
విచారణకు హాజరు కాకుంటే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి?
ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకున్న వారందరినీ విచారించడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు ఎనిమిది మందిని విచారించనున్న క్రమంలో హేమ తాను రాలేనని లేఖ రాసిన విషయం తెలిసిందే. మరి మిగతావారు అయినా హాజరయ్యారా? విచారణకు హాజరుకాని వారి విషయంలో బెంగళూరు సిసిబి పోలీసులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications