బర్రెలక్క, పల్లవి ప్రశాంత్ : సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్!!
ప్రస్తుతం మీడియా కంటే సోషల్ మీడియానే ఏదైనా ఒక విషయాన్ని త్వరగా ప్రజల వద్దకు తీసుకు వెళుతుంది. సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ప్రస్తుతం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. పట్టుమని పదిమంది కూడా గుర్తుపట్టలేని వాళ్లకు సెలబ్రిటీ స్టేటస్ ను తీసుకువస్తుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో అట్లా సెలబ్రిటీ స్టేటస్ కు వచ్చినవాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క, బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఇద్దరు సామాన్యులే కావడం, వీరు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తూ ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది.

బిగ్ బాస్ షోలో రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్, పదేపదే చూసే ప్రేక్షకులకు, తను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడినని, వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన రైతుని అని చెప్పడంతో, కామన్ మ్యాన్ ని బిగ్ బాస్ విన్నర్ చేయాలని భావించే చాలామంది పల్లవి ప్రశాంత్ కు పట్టం కడుతున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
ఇక మరోవైపు డిగ్రీ చదివి ఉద్యోగం రాలేదని అందుకే గేదెలు కాస్తూ బ్రతుకుతున్నాను అంటూ గతంలో ఒక వీడియో చేసిన బర్రెలక్క, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీ చేయడంతో అందరి దృష్టి బర్రెలక్క మీద కేంద్రీకృతమైంది. ప్రస్తుతం సోషల్ మీడియా ని ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా బర్రెలక్క మాట్లాడిన వీడియోలు కనిపిస్తున్నాయి.
సామాన్యురాలిగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్కకు మేమున్నామంటూ పబ్లిక్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉండడంతో, ఊహించని విధంగా బర్రెలక్కకు వచ్చిన క్రేజ్ చూసి రాజకీయ పార్టీల నాయకులు వణికిపోతున్నారు. ఇక తనకు ఇంత పేరు వస్తుందని బర్రెలక్క కూడా ఊహించి ఉండదు.
కేవలం సామాన్యులు అన్న కాన్సెప్ట్ అటు పల్లవి ప్రశాంత్ విషయంలోనూ, ఇటు బర్రెలక్క విషయంలోనూ వర్కౌట్ అవుతుంది. కామన్ మ్యాన్ తలుచుకుంటే సామాన్యులను కూడా సెలబ్రిటీలను చేయవచ్చని ఇటువంటి సంఘటనలతో ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది .












Click it and Unblock the Notifications