కేసీఆర్ పై పోటీ చేస్తే గెలుస్తా..ఈటల ధీమా వెనుక బిగ్ రీజన్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను తాను ఢీ కొడతాను అంటూ, సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తించాయి. సీఎం కేసీఆర్ పై పోటీ చేసి తను కెసిఆర్ ను చిత్తుగా ఓడిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని పేర్కొన్న ఈటల రాజేందర్ ఇంత ధీమా వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణం ఉందని ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్, ఈసారి ఎన్నికలలో గజ్వేల్ నుంచి, కామారెడ్డి నుంచి రెండుచోట్ల ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే బి ఆర్ ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్త నాయకులు సీఎం కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి కోసం పని చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
ఇక్కడ కేసీఆర్ పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా నిలుస్తామని అసంతృప్త నేతలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ బల్దియా మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ టేకులపల్లి రామిరెడ్డి, మాజీ ఎంపీపీ రాజు, జడ్పిటిసి మాజీ సభ్యుడు సింగం సత్తయ్యతో పాటు పలువురు సర్పంచులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కెసిఆర్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో ఎంత కష్టపడినా ఇప్పటికీ తమను ఎదగనివ్వడం లేదన్న అసంతృప్తి అక్కడి నేతల్లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ అసంతృప్త నేతల మద్దతు సంపూర్ణంగా దొరుకుతుందన్న భావనలో ఉన్న ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే కెసిఆర్ పై గెలుస్తానని ధీమాతో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో బిజెపి అధిష్టానం ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ పై బరిలోకి దింపుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications