బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఆ కేసులో ఏడాది జైలు శిక్ష.. జరిమానా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సీజన్లో ఎవరెవరు ఉండబోతున్నారు? ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి ప్రేక్షకులలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఈసారి సామాన్య ప్రజలను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపే బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ పైన పెద్ద క్రేజ్ కనిపిస్తోంది.

ఏడేళ్ళ క్రితం చేసిన యాక్సిడెంట్ కేసులో లోబోకు శిక్ష
ఇదే సమయంలో బిగ్ బాస్ లో మాజీ కంటెస్టెంట్ గా ఉన్న ఒకరికి ఒక కేసులో జైలుశిక్ష పడడం తాజాగా హాట్ టాపిక్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఉన్న ఆర్ జే లోబో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన విభిన్నమైన వేషధారణ, మాటతీరుతో చాలామందిని ఆకట్టుకున్న లోబో ఏడేళ్ళక్రితం చేసిన ఒక యాక్సిడెంట్ అతనికి జైలుశిక్ష పడేలా చేసింది.

Bigg Boss contestant sentenced to one year in prison in that case fine too

జైలు శిక్ష విధించిన కోర్టు
హైదరాబాద్ కు చెందిన లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. ఒక టాటూ షాపులో పని చేస్తున్నప్పుడు ఒక రష్యన్ యువతి అతనికి లోబో అని పేరు పెట్టింది. ఆ తర్వాత డీజే గా, ఆర్ జే గా పనిచేస్తూ, మా మ్యూజిక్ లో యాంకర్ గా అవకాశం రావడంతో, సినిమాలలో కూడా చాన్సులతో ఇప్పుడు దూసుకుపోతున్నాడు. అటువంటి లోబోకు కోర్టు తాజాగా ఒక యాక్సిడెంట్ కేసులో జైలుశిక్ష విధించింది.

కారు ప్రమాదంలో ఇద్దరి మృతికి కారణమైన లోబో
ఏడేళ్లనాటి కేసులో లోబోకి కోర్టు జైలుశిక్ష విధించింది. 2018 మే 21వ తేదీన వరంగల్ లో షూటింగ్ ముగించుకుని తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్ బయలుదేరిన లోబో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఒక ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పెంబర్తి మణెమ్మ, మేడే కుమార్ మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లోబో నడుపుతున్న కారు అదుపు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి.

ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా
ఇక ఈ కేసు పైన సుదీర్ఘ విచారణ చేసిన పోలీసులు చివరికి చార్జిషీట్ దాఖలు చేశారు. లోబో నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని నిర్ధారించిన జనగామ కోర్టు, అతనికి ఏడాది జైలు శిక్షతో పాటు, 12,500 జరిమానా విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+