బిగ్ బాస్ సీజన్ 7 : హోస్ట్‌గా ఆ హీరోనే ఫైనల్; ఫుల్ ఎంటర్టైన్మెంట్!!
తెలుగు టెలివిజన్ తెరపై బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు బిగ్ బాస్ 6 సీజన్లు కొనసాగగా, ప్రస్తుతం ఏడవ సీజన్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు . అయితే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు? ఈ సీజన్ ను హోస్ట్ చేసేది ఎవరు? ఆసక్తిగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 6 కు అనుకున్నంత రెస్పాన్స్ లేకపోవటంతో ఈ సీజన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్ ల కంటే బోలెడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా సీజన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ హోస్ట్ మారుతున్నారని నిన్నా మొన్నటిదాకా బాగా ప్రచారం జరిగింది. నాగార్జున స్థానంలో హోస్ట్ గా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి పేర్లు వినిపించాయి.

కానీ తాజాగా అలాంటిదేమీ లేదని ఈ సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తారని తేలిపోయింది. బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆ సీజన్ చాలా మంచి రెస్పాన్స్ తో మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోయింది. ఆ తర్వాత సీజన్ 2 నాని హోస్ట్ చేశారు. నానీ జూనియర్ ఎన్టీఆర్ అంత కాకున్నా తన వరకు నానీ కూడా బాగానే సీజన్ 2 హోస్ట్ చేశారు.
తర్వాత సీజన్ 3 నుండి సీజన్ 6 వరకు మొత్తం నాలుగు సీజన్లు నాగార్జున హోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు హోస్ట్ కూడా మారుతున్నట్టు ప్రచారం జరిగినా అదంతా ప్రచారం మాత్రమే అని తెలుస్తుంది. ఈ సీజన్ కూడా మన్మధుడు నాగార్జునే హోస్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించి నాగార్జున ఫోటో షూట్ కూడా పూర్తి అయినట్టు సమాచారం .
త్వరలోనే అఫీషియల్ గా మరో ప్రోమో ద్వారా నాగార్జునే హోస్ట్ అని చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో నాగార్జున చేతితో సెవెన్ సింబల్ చూపిస్తూ న్యూ లుక్ తో కనిపించారు. ఇక బిగ్ బాస్ హోస్ట్ ఆయనే అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
అంతేకాదు ఊరూ, పేరూ లేని యూ ట్యూబ్ లలో పని చేసే వారిని కాకుండా కాస్త జనాలకు తెలిసిన ముఖాలను ఈసారి బిగ్ బాస్ ద్వారా కంటెస్టెంట్స్ గా పరిచయం చెయ్యనున్నారు. సీరియల్ స్టార్స్, బాగా తెలిసిన సింగర్స్, సోషల్ మీడియాలో జనాలకు బాగా తెలిసిన సెలబ్రిటీల పేర్లు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications