బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభకు రాజ్‌నాథ్ సింగ్, గట్టి భద్రత
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండుతో బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభను తలపెట్టింది.
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండుతో బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభను తలపెట్టింది.
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి బిజెపి శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చేలా ఆ పార్టీ నాయకులు చూస్తున్నారు.

ఈ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారమే సభాస్థలిని పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు.
సభాస్థలి వద్ద ఏర్పాట్లకు సంబంధించి ఆ పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు శనివారం పరిశీలించారు. బహిరంగ సభకు లక్ష మందికి సరిపడా ఏర్పాట్లు చేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications