కర్రతో బెదిరిస్తూ, బురద నీటిలో మునగాలని: దళిత యువకులపై బీజేపీ నేత దాష్టీకం (వీడియో)
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి, వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.
Recommended Video

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి, వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది.
దళిత యువకులు కొండ్ర లక్ష్మణ్, రాజేశ్వర్‌లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదయింది.

ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గంగాధర్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కాగా, అక్రమంగా మట్టిని తరలించడాన్ని ఆ దళిత యువకులు ప్రశ్నించారని, దీంతో వారిపై భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేశాడని తెలుస్తోంది. కర్రతో బెదిరిస్తూ, వారిద్దరిని బురద ఉన్న చెరువులో మునగాలని హెచ్చరించాడు.
#Nizamabad #BJP local leader canes, threatens & punishes 2 Dalit men for questioning him about illegal sand mining. Leader's men recorded incident on cam which has now gone viral. #Telangana @asadowaisi @realkeerthi @divyaspandana pic.twitter.com/2KvcrE8jIQ
— PAUL OOMMEN (@Paul_Oommen) November 12, 2017
దళిత యువకులపై భరత్ రెడ్డి దాడి నేపథ్యంలో దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు సిద్దమయ్యాయి. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో నిరసనకు పిలుపునిచ్చాయి. భరత్ రెడ్డి దాష్టికానికి తగిన బుద్ది చెప్పాలని దళిత బహుజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications