వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో బీజేపీ మాస్టర్ ప్లాన్: కేసీఆర్ తో మైండ్ గేమ్.. ఏం జరుగుతుందో?

|
Google Oneindia TeluguNews

దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న బిజెపి సర్కార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారిస్తోందా? దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి శక్తియుక్తులను కూడగట్టుకుంటుందా? పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును పొందడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందా? ఇదే సమయంలో కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి కేంద్రం తన అధికార బలాన్ని ఉపయోగించనుందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

తెలంగాణాపై కేంద్రం ఫోకస్.. ఆసక్తికర రాజకీయాలు

తెలంగాణాపై కేంద్రం ఫోకస్.. ఆసక్తికర రాజకీయాలు

తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బిజెపి అధినాయకత్వం ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు. ఇక ఈ నెల 14వ తేదీన అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జాతీయ నాయకుల పర్యటనలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ కమిటీలు వేయడం, దర్యాప్తు అధికారులను నియమించడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.

అవినీతి ఆరోపణలపై రంగంలోకి కేంద్రం .. ధాన్యం కొనుగోళ్ళు, మిషన్ భగీరధపై విచారణ

అవినీతి ఆరోపణలపై రంగంలోకి కేంద్రం .. ధాన్యం కొనుగోళ్ళు, మిషన్ భగీరధపై విచారణ


తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పేరుతో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ చేసిన ఫిర్యాదుతో జల జీవన్ కమిషన్ నిర్వహించిన సర్వేతో ఇచ్చిన నివేదిక మేరకు విచారణ జరపాలని విచారణ అధికారులను నియమించింది కేంద్రం. ప్రతిపక్షాల ఆరోపణలతో మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఎఫ్సీఐ విచారణ జరుపుతోంది. ధాన్యం కొనుగోలు అవకతవకలపై విచారణ జరపడం కోసం ఎప్పుడైనా సిబిఐ రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతుంది.

తెలంగాణాలో జరిగిన అవినీతిపై కేంద్రం అడుగులు

తెలంగాణాలో జరిగిన అవినీతిపై కేంద్రం అడుగులు

ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా, తెలంగాణ ప్రభుత్వం చేసిన అవినీతిపై కేంద్రం రంగంలోకి దిగడానికి ప్రయత్నిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, కెసిఆర్ కు ఎటిఎం గా మారిందని భావిస్తున్న కేంద్రం ముందు ప్రాజెక్టుల పైన కూడా దర్యాప్తుకు ఆదేశించే అవకాశం లేకపోలేదన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతుంది. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థలపై దాడులు జరుగుతున్న వేళ ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎటువంటి అడుగులు వేయబోతుందో అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

కేసీఆర్ పై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహంలో బీజేపీ

కేసీఆర్ పై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహంలో బీజేపీ

కేంద్ర సర్కార్ పై, ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి వచ్చే ఎన్నికల పోరులో కెసిఆర్ ను బలహీనం చేయాలన్న వ్యూహం ప్రధానంగా బిజెపీ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తుంది. ఇక కేంద్రం అంచనాలను ముందే పసిగట్టగల తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి ఆడుతున్న మైండ్ గేమ్ లో ఒత్తిడిని ఫేస్ చేస్తారా లేక బిజెపి వ్యూహాలకు చెక్ పెడతారా అనేది ముందు ముందు తెలియనుంది.

English summary
BJP has laid out a master plan to put a check to KCR in Telangana. Ordered an investigation into allegations of corruption like never before. Mind game continues with KCR..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X