రాములోరి తిరుకల్యాణ ఉత్సవాలు .. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నేడు ఎదురుకోలు ఉత్సవం
రేపు జరుగనున్న రాములోరి కల్యాణానికి భద్రాద్రి శోభాయమానంగా ముస్తాబైంది .ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం జరుగనున్న నేపధ్యంలో రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

ఘనంగా ధ్వజారోహణం ..
స్వామి వారి తిరు కళ్యాణోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన ధ్వజపటలేఖన కార్యక్రమం ఘనంగా జరిగింది .భద్రాద్రి సీతారామ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం గరుడాధివాసం పూజలు నిర్వహించారు. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణోత్సవాల్లో శుక్రవారం భద్రాచలంలో నిర్వహించిన ధ్వజారోహణం కనులపండుగగా సాగింది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన గరుత్మంతుడి పటాన్ని ఈ సందర్భంగా ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఇప్పటి నుంచి పూర్ణిమ నాటి వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవులకే తెలిపేలా ఈ ధ్వజారోహణ నిర్వహించారు.

భేరీపూజ .. నేడు ఎదుర్కోలు వేడుక
అలాగే అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే భేరీపూజ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణాన్ని పురస్కరించుకొని అందజేసే ప్రసాదంతో సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసాదాన్ని స్వీకరించారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి.నేడు భద్రాద్రిలో స్వామివారి ఎదురుకోలు వేడుక ఘనంగా జరగనుంది.

మిథిలా స్టేడియంలో ఘనంగా కళ్యాణానికి ఏర్పాట్లు
ఆదివారం భద్రాద్రి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నవమిని పురస్కరించుకొని భద్రాద్రి సర్వాలంకారాలతో కాంతులీనుతుంది .. 14న జరిగే శ్రీరామ మహా పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరు కానున్నారు.

కళ్యాణానికి ఏర్పాట్లు చేసిన అధికారులు
కళ్యాణోత్సవానికి వచ్చే అశేష భక్త జనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు . చలువపందిళ్ళు వేశారు . మౌలిక వసతులను కల్పించారు నవమి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ 1800 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications