సిటీలోనే చెడ్డీ గ్యాంగ్ మకాం: మీర్‌పేటలో చోరీ కలకలం, వాచ్‌మన్‌ను కట్టేసి..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ కలకలం సృష్టించింది. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వేకువజామున ఎనిమిది మంది చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు దోపిడీకి పాల్పడ్డారు.

  Cheddi Gang/Robbery Gangs Hulchal In Hyderabad City : Video

  ఏపీ09 సీపీ 4061 నంబర్‌ గల వాహనంలో వచ్చిన ఈ చెడ్డీ గ్యాంగ్.. బ్లూమింగ్‌ డాల్‌ అపార్టుమెంట్‌లోకి జోరబడి వాచ్‌మన్‌ను కట్టేశారు, అనంతరం లోనికి ప్రవేశించి ఎనిమిది ఫ్లాట్లకు బయటి నుంచి గడియ పెట్టారు.

  జాగ్రత్త! సిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్: 'ఖాకీ'ని తలపించేలా దోపిడీలు!

  చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు

  చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు

  చంద్రమోహన్‌రెడ్డికి చెందిన అపార్టుమెంట్‌లోకి ప్రవేశించి 11 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళారు. ఆ సమయంలో ఇంటి యజమాని ఇంట్లో లేరు. పనిమీద పొరుగూరికి వెళ్ళారు. కాగా, ఆయన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.

  కేకలు వేయడంతో..

  కేకలు వేయడంతో..

  అపార్ల్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ అలజడితో ఇరుగుపొరుగు అపార్టుమెంట్‌లలోని వారు లేచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, బయటి నుంచి గడియ పెట్టడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో గట్టిగా కేకలు పెట్టారు. ఆ కేకలు విన్న సమీపంలోని ప్రజలు రావడంతో చెడ్డీగ్యాంగ్‌ ముఠా అక్కడ్నుంచి పరారైంది.

  ఘటనా స్థలానికి డీసీపీ..

  ఘటనా స్థలానికి డీసీపీ..

  సమాచారం అందుకున్న ఎల్‌బీ నగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు సిబ్బందితో చోరీ జరిగిన అపార్టుమెంట్‌ను పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. చెడ్డీగ్యాంగ్‌ ముఠా కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

  నగరంలోనే మకాం వేశారా?

  నగరంలోనే మకాం వేశారా?

  కాగా, ఈ గ్యాంగ్ గతంలో కూడా నగరంలో చోరీలకు యత్నించిన విషయం తెలిసిందే. అంటే ఇక్కడే మకాం వేసిన చెడ్డీ గ్యాంగ్ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతోందని తెలుస్తోంది. కాగా, పలు సీసీ కెమెరాల్లో కూడా వీరి దృశ్యాలు నమోదయ్యాయి. వీరంతా ఎక్కువగా తాళం వేసిన ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ చెడ్డి గ్యాంగుకు మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్. శరీరానికి ఒండు మట్టి గానీ నూనె గానీ రాసుకుని వీరు సంచరిస్తుండటం గమనార్హం. ఎవరైనా పట్టుకునేందుకు ప్రయత్నించినా వీరు దొరక్కుండా జారిపోయేందుకే ఈ ప్లాన్.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chaddi gang theft gold and cash in a apartment Meerpet on wednesday early morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి