హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్: కొడుకు పుట్టాడని 25రోజుల పసికందును బ్లేడుతో కోసి చంపిన తల్లి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడుమెట్‌ ఆర్కేపురంలో పసికందు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొలుసు దొంగల దాడిలో గాయపడి చిన్నారి మృతి చెందాడన్న తల్లి వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు.

ఆర్కేపురంకు చెందిన పూర్ణిమ మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తన 25 రోజుల కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో ఎదురుగా బైక్ పైన వచ్చిన ఇద్దరు గొలుసు దొంగలు పూర్ణిమపై స్ప్రే చల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపారు.

అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది

మూడో కాన్పులోనూ మగపిల్లాడే పుట్టడం, ఆ పిల్లాణ్ని మార్చి ఆడబిడ్డను దత్తత తీసుకుందామంటే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తల్లి పూర్ణిమ కన్నబిడ్డనే హతమార్చిందని తేలింది. 25 రోజుల పసిగుడ్డును బ్లేడుతో గొంతుకోసి చంపి, గొలుసుదొంగ ఘాతుకమని నమ్మించేందుకు ప్రయత్నించింది.

 అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది

ఆడపిల్ల పుట్టిందని చెత్తకుండీల పాలుజేస్తున్న ఈ రోజుల్లో.. ఆడబిడ్డ కోసం ఓ తల్లి ఇంత ఘాతుకానికి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ధన్‌పాల్‌ శ్రీధర్ రాజుకు ఆరేళ్ల క్రితం పూర్ణిమతో పెళ్లైంది. పూర్ణిమకు అయిదేళ్ల క్రితం తొలి కాన్పులో పిల్లాడు పుట్టి చనిపోయాడు. ప్రస్తుతం నాలుగేళ్ల బాబు ఉన్నాడు.

అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది

మూడో కాన్పులోనైనా ఆడపిల్ల పుడుతుందని కలలుగన్న పూర్ణిమ.. మళ్లీ బాబు పుట్టడంతో నిరాశపడింది. పిల్లాడిని ఎవరికైనా ఇచ్చి ఆడపిల్లను దత్తత తీసుకుందామని ఆమె అడిగినా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పూర్ణిమ.. భర్తకు ఫోన్‌ చేసి బాబుకు వాంతులవుతున్నాయని చెప్పింది.

అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది


తాను బాబును తీసుకొస్తున్నానని, మధ్యలో రిసీవ్‌ చేసుకోవాలని కోరింది. అయితే శ్రీధర్‌రాజు వచ్చేసరికి ఆమె రోడ్డు మధ్యలో పడి ఉంది. ఏమైందని అడిగితే.. నడుచుకుంటూ వస్తుండగా ఇద్దరు దుండగులు నాపై మత్తుమందు చల్లి మెడలో గొలుసు లాక్కెళ్లారని, స్పృహలోకి వచ్చి చూసేసరికి బాబు గొంతు కోసుకుపోయి ఉందని చెప్పింది.

అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది

శ్రీధర్‌ హుటాహుటిన భార్యాబిడ్డలను మల్కాజిగిరిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే బాబు మృతి చెందాడు. రాత్రి పదకొండు గంటలకు ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పూర్ణిమ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.

అమ్మే చంపేసింది

అమ్మే చంపేసింది

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. చిన్నారి మెడపై గాయం, గొలుసు కోసుకుపోయి తెగినట్లుగా లేకపోవడంతో అనుమానించారు. అర్ధరాత్రి శ్రీధర్‌ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లోనే బ్లేడ్‌ పడి ఉండడం చిన్నారి దుస్తులు నీళ్లలో నానబెట్టి ఉండడంతో పూర్ణిమపై అనుమానం బలపడింది. దుస్తులకు అంటిన రక్తపు మరకల నమూనాల్ని పరీక్షలకు పంపించాలని నిర్ణయించారు.

పూర్ణిమ ప్రతిఘటించడంతో పెనుగులాట జరిగింది. దొంగలు దాడిచేసి గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటనలో పూర్ణిమ చంకలో ఉన్న పసికందు గొంతుకు తీవ్రగాయామైంది. ఘటన నుంచి తేరుకున్న పూర్ణిమ భర్త శ్రీధర్‌తో కలిసి పసికందును తార్నాకలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పసికందు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే, 25 రోజుల పసికందును తల్లే హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

దీని పైన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అబద్దం చెబుతున్నారని, తన కోడలు బయటకు వెళ్లినప్పుడు బంగారపు పుస్తెల తాడు ఉందని, ఆమె ఇంటికి వచ్చేసరికి లేదన్నారు. తన మనవడు అంటే తమకూ ప్రేమేనని, కానీ తమ కోడలి పైన అభాండాలు వేయవద్దని అంటున్నారు.

ఇదిలా ఉండగా, పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన దానిపై పోలీసులు అనుమానించి ఆమె ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

తల్లే నిందితురాలు, తేల్చిన పోలీసులు

నేరేడుమెట్‌లో చైన్ స్నాచింగ్ సంఘటనలో పసికందు ప్రాణాలు కోల్పోలేదని, కన్నతల్లి పూర్ణిమనే తన బిడ్డను హతమార్చిందని పోలీసుల విచారణలో తేలింది. దొంగ తనను గొలుసు తెంపడం, బాధితురాలు ప్రతిఘటించడం, పెనుగులాటలో తన చేతిలోని బిడ్డ కిందపడిందని తల్లి పూర్ణిమ చెప్పిన విషయాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు.

పూర్ణిమకు వరుసగా ముగ్గురు కుమారులు పుట్టారని, కూతురు పుట్టడం లేదనే మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితురాలు తమ విచారణలో చెప్పిందని పోలీసులు తెలిపారు. చైన్ స్నాచర్ అంటూ పోలీసులకు కట్టుకథలు చెప్పిందని చెబుతున్నారు.

English summary
Chain snatching on the rise in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X