వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మొండిచేయి, చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి: రేవంత్ రెడ్డికి ఎసరు

అనివార్యమైన స్థితిలోనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mothkupalli Narsimhulu Forced To Chandra Babu చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి..| Oneindia Telugu

హైదరాబాద్: అనివార్యమైన స్థితిలోనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోత్కుపల్లి నర్సింహులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు చెబుతున్నారు. ఆయనకు గవర్నర్ పదవిని ఆయన హామీ ఇచ్చారు. బిజెపి నాయకత్వాన్ని ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు చేశారు.

కానీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి రాలేదు. దీంతో మోత్కుపల్లికి సరైన పదవి ఇవ్వాల్సిన ఒత్తిడిలో చంద్రబాబు పడినట్లు చెబుతున్నారు.

అసలేమైంది....

అసలేమైంది....

మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి తప్పకుండా వస్తుందనే నమ్మకం ఇటీవలి దాకా ఉంటూ వచ్చింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఓ సందర్బంలో ఆ సంకేతాలను కూడా ఇచ్చారు. దాంతో నమ్మకం మరింత పెరిగింది. అయితే, ఇటీవల కొత్త గవర్నర్ల నియామకం జరిగినప్పుడు మోత్కుపల్లి పేరు కనిపించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.

మోత్కుపల్లి ప్లాన్ ఇదీ...

మోత్కుపల్లి ప్లాన్ ఇదీ...


బిజెపి తనకు గవర్నర్ పదవి ఇవ్వకపోవడం వల్ల మోత్కుపల్లి మరో ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె చంద్రశేఖర రావుతో నెయ్యం నెరిపి రాజ్యసభకు వెళ్లాలని ఆయన ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు కాంగ్రెసుతో తెలంగాణ టిడిపి పొత్తు పెట్టుకుంటే ఆటంకంగా మారుతుంది. దాంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కోసం జరుగుతున్న చర్చలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో మోత్కుపల్లి కాంగ్రెసుతో తాము పొత్తు పెట్టుకోబోమని చెప్పినట్లు సమాచారం. తెరాసతో గానీ బిజెపితో గానీ పొత్తు పెట్టుకుంటాం గానీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోబోమని ఆయన చెప్పారు.

చంద్రబాబుపై ఒత్తిడి...

చంద్రబాబుపై ఒత్తిడి...

మోత్కుపల్లి నర్సింహులు ఒత్తిడికి చంద్రబాబు గురైనట్లు చెబుతున్నారు. పైగా, చాలా కాలంగా కెసిఆర్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించాల్సిన అనివార్యతలో కూడా చంద్రబాబు పడ్డారు. కెసిఆర్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, తెలంగాణలో తెరాసతో పొత్తుకు అంగీకరిస్తే మోత్కుపల్లి కోరిక నెరవేర్చడానికి వీలవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. దానికితోడు, రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, ఆంధ్ర మంత్రులు కొంత మంది కెసిఆర్ నుంచి ప్రయోజనాలను పొందుతూ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. అందువల్ల వారికి తెలంగాణలో తెరాసను ఎదుర్కోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఈ ఒత్తిడి కూడా చంద్రబాబు మీద ఉన్నట్లు చెబుతున్నారు.

తెర మీదికి వెల్‌కమ్...

తెర మీదికి వెల్‌కమ్...

మోత్కుపల్లి ఆలోచన, ఆంధ్ర మంత్రుల ప్రయోజనాలు, చంద్రబాబు అటు వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి టిడిపిలో ఇమడలేని స్థితి వచ్చింది. అదే సమయంలో తెర మీదికి కెసిఆర్ వెల్‌కమ్ వ్యూహం వచ్చింది. రెడ్డి సామాజిక వర్గాన్ని తెలంగాణలో చావుదెబ్బ తీసేందుకు వెలమ, కమ్మ కాంబినేషన్‌కు తెర తీశారు. ఇన్నాళ్లుగా కెసిఆర్‌ను ఎదుర్కుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

English summary
It is said that Telugu Desam party Telangana working president has been forced to come out of the party by TDP chief, Andhra Pradesh CM Nara Chandrababu Naidu's pro- KCR stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X