మంగళవారం.. యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీలో.. ఎక్సైటింగ్ గా ఉందన్న చిరంజీవి!!
మంగళవారం.. ఆర్ఎక్స్ 100 సినిమా తీసిన అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం. ఈ సినిమా పేరు తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక భయపెట్టేలా ఉత్కంఠ భరితంగా పాయల్ రాజపుత్ మంగళవారం సినిమా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది.
నేడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు దర్శకుడు అజయ్ భూపతి ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ మూవీ తనకు సక్సెస్ ఇస్తుందని అజయ్ భూపతి భావిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన చిరంజీవి ఈ సినిమాపై ఆసక్తికరమైన పోస్టును ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

చిరంజీవి తాను చేసిన పోస్టులో సినీ నిర్మాత స్వాతి రెడ్డిపై, అలాగే మహిళలు సినిమా రంగంలో వివిధ విభాగాలలోకి రావడంపై స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ ను తాను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్న చిరంజీవి 'మంగళవారం' సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నాకు సన్నిహితులు అని పేర్కొన్నారు.
ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి అని పేర్కొన్న చిరంజీవి, మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు అని పేర్కొన్నారు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లోకి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా వుంటుందన్నారు. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీతో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరన్నారు.
అందుకని స్వాతిరెడ్డి లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం అన్నారు.విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications