వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ? : తడిసి ముద్దయిన నగరం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : చినకు పడిందంటే చాలు నగరం ముద్దయిపోతుంది. ఎక్కడి చూసినా చిత్తడి.. నీళ్లు నిండిపోయిన రోడ్లపై ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి. మంగళవారం నాడు కురిసిన కుండపోత వర్షానికి నగరమంతా చెరువులమయంగా మారింది. మోకాళ్ల లోతు నీళ్లలో నగర జనం నానా అవస్థలు పడ్డారు.

ఇక ట్రాఫిక్ సంగతి చెప్పనక్కర్లేదు. భారీ ట్రాఫిక్ జామ్ తో నగర రోడ్లు స్తంభించిపోయాయి. ఓవైపు చెరువులను తలపించే రోడ్లు.. మరోవైపు ఎంతకీ కదలని ట్రాఫిక్ తో నగరం జనం పాట్లు అన్నీ ఇన్నీ కావు. సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

సుమారు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో.. చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి క్వార్టర్స్, బాపూజీ నగర్, పాలమూరు బస్తీ, నాగమయ్య కుంట, , అంబేద్కర్ నగర్, తాళ్ల బస్తీ, జాంభవీ నగర్, లంబాడీ బస్తీ, పాతబస్తీలోని పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

భారీ వర్షానికి ఫిలింనగర్, బోరబండ, పర్వత్‌నగర్, ఎన్టీఆర్ నగర్ వంటి బస్తీలు, కూకట్‌పల్లి సర్కిల్ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కాగా, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ప్రభావం విస్తరించి ఉండటంతో మరో రెండు రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

పాలకుల నిర్లక్ష్యమో.. అధికారుల అలసత్వమో గానీ మొత్తానికి నగరంలో డ్రైనేజీ సమస్య ఏళ్లుగా వేధిస్తూనే ఉంది. కాంక్రీట్ జంగిల్ ను తలపించే నగరంలో వాన నీరు ఇంకే పరిస్థితి లేకపోవడంతో.. చాలా ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

లాలాగూడ శేషాపహాడ్ ప్రాంతంలో నిర్మించిన ఈద్గా ప్రహారిగోడ కూలిపోవడంతో.. మంత్రి పద్మారావుతో పాటు కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

రోడ్లన్ని నిండు కుండల్లా మారిపోవడం.. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలు ట్రాఫిక్‌లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

ప్రభుత్వ నిధులతో చేపడుతున్న నిర్మాణాలను నాసిరకం పనులతో చేపడుతూ కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికి తనిఖీలు చేసి పరిశీలించాల్సిన అధికారులు కాంట్రాక్టర్ల పట్ల చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో పలు నిర్మాణాలు ఈద్గా ప్రహారీ గోడ తరహాలో పేకమేడలా కూలిపోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

రాజేంద్రనగర్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. నగరంలోని మెహిదీపట్నం, లంగర్‌హౌస్, గోల్కొండ, షేక్‌పేట్, మాసాబ్‌ట్యాంక్, మల్లేపల్లి, గుడిమల్కాపూర్, కార్వాన్, జియాగూడ, పూరానాపూల్, ధూల్‌పేట్, మంగళహాట్, గోషామహల్ ప్రాంతాలన్నీ చెరువులను తలపించడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం, మచ్చబొల్లారంలలో వరద నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మచ్చబొల్లారం, తుర్కపల్లి, రైల్వేకాలనీ, రుక్మిణీదేవీ కాలనీ, సూర్యనగర్, ఓల్డు అల్వాల్ అంబేద్కర్‌నగర్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, వెస్టు వెంకటాపురం, భూదేవినగర్, లోతుకుంట, ఇందిరానగర్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, ఓల్డు బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, మహేంధ్రాహిల్స్, కంటోనె్మంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

చాలా చోట్ల ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు. వర్షం పడ్డ ప్రతీసారి నగరం ఇలా సమస్యల సుడిగండంగా మారడం పరిపాటిగా మారిపోయింది.

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

వానొస్తే.. ఇన్ని ఇక్కట్లా ?

ముఖ్యంగా మ్యాన్ హోల్స్ విషయంలో నగరం జనం ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై భారీగా నిలిచిన వర్షం నీటితో మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో తెలియక ఆందోళనకు గురవతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
City people Faced lot of problems due to Rain. Most of the roads were strucked with vehicles, hours traffic jam was irritated city people.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి