మరాఠా గడ్డపై బరిలో ఇందూరు నేతలు? సీఎం కేసీఆర్ 'మహా' పాలిటిక్స్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. బీజేపీని గద్దె దించటమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న నిజామాబాద్ జిల్లా నేతలను మహారాష్ట్రలో బరిలోకి దించే ప్లాన్లో ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు సీఎం కేసీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను ఈ సారి ఎన్నికల బరిలో నిలిపేందుకు రంగం సిద్దం చేయాలని గులాబీ బాస్ కెసిఆర్ సూచించారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

దీంతో షకీల్ తన సతీమణి అయేషా ఫాతిమాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజులుగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ భార్య ఆయేషా ఫాతిమా బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారని బోధన్ నియోజకవర్గం నుండి ఈ సారి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
నాందేడ్ పార్లమెంటు పరిధిలో రాజకీయాలపై ఫోకస్ చేయాలని షకీల్ కు గులాబీ బాస్ టాస్క్ అప్పగించిన నేపథ్యంలో నాందేడ్ లో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలు సక్సెస్ కావడం లో షకీల్ కీలక భూమిక పోషించారు. నాందేడ్ లో పట్టు కోసం షకీల్ తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మైనారిటీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నాందేడ్ లో షకీల్ ను బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా మరాఠా గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడానికి సీఎం కేసీఆర్ నాందేడ్ పార్లమెంటు నియోజకవర్గం నుండి షకీల్ కు అవకాశం ఇస్తారా? లేక ఆయన సతీమణి అయేషాకు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications