కొండా సురేఖకు సీఎం రేవంత్ బిగ్ షాక్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ లో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన విషయం తెలిసిందే. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చిందా? ఆమెకు చేదు అనుభవం మిగిల్చిందా? సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు అని చెప్పడానికి ఆయన తాజా పర్యటన ఉదాహరణగా నిలిచిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
హన్మకొండ వరద ప్రాంతాలలో పర్యటించిన సీఎం
సీఎం రేవంత్ రెడ్డి నిన్న గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. మొదట హుస్నాబాద్ మండలంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన అనంతరం హనుమకొండ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. మైసయ్య నగర్, పోతన నగర్ వంటి వరద ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాలు పెట్టని రేవంత్
అధికారులకు వరద నష్టానికి సంబంధించి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో తీసుకొని పంపించాలని కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడుగుతామని చెప్పి వెళ్లారు. అయితే మొత్తం సీఎం పర్యటనలో ట్విస్ట్ ఏంటంటే కేవలం హనుమకొండ నగరంలో మాత్రమే వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గం అయిన వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాలు కూడా పెట్టలేదు.
సురేఖ నియోజకవర్గంలో ముంపు బాధితుల ఎదురుచూపు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముంపు కాలనీలను సందర్శించలేదు. కేవలం హనుమకొండకు మాత్రమే పరిమితమై సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. ఈ చర్యతో సీఎం రేవంత్ రెడ్డి కొండ సురేఖకు షాక్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు, ముంపు బాధితులు తమ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తాడని భావించారు. కానీ కొండా సురేఖ కారణంగానే ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు.
కొండా సురేఖకు చేదు అనుభవం
సీఎం పర్యటన మొత్తంలో కొండా సురేఖ ఆయన పక్కనే ఉండి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం కొండా సురేఖతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఆమెను పట్టించుకోనట్టే ప్రవర్తించారు. ఇక వరంగల్ లోని ముంపు ప్రాంతాలను సందర్శించకపోవడం కొండా సురేఖ పట్ల రేవంత్ రెడ్డి చూపించిన నిర్లక్ష్య వైఖరి ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కొండా సురేఖ విషయంలో రేవంత్ కాంప్రమైజ్ కావడం లేదు అనే విషయాన్ని మరో మరో స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications